ఎమ్మెల్యే చిన్నం దుర్గ య్య బాధితురాలు ఆత్మహత్యాయత్నం

ఎమ్మెల్యే చిన్నం దుర్గ య్య బాధితురాలు ఆత్మహత్యాయత్నం

ఎమ్మెల్యే చిన్నం దుర్గ య్య తనను  లైంగికంగా వేధించారని ఆరోపించిన శేజల్ ఆత్మహత్యాయత్నం చేసింది.  ఈ రోజు ( జూన్ 29) మధ్యాహ్నం 1.30 గంటలకు పెద్దమ్మ గుడి దగ్గర నిద్ర మాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం అందుతోంది. పెద్దమ్మ టెంపుల్ దగ్గర స్పృహ తప్పి పడిపోయిన శేజల్ గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  శేజల్ బ్యాగును పరిశీలించిన పోలీసులు అందులో నిద్రమాత్రలు ఉన్నట్లు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న శేజల్ ను పోలీసులు ఆస్పత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది.    అయితే ఈ రోజు ( జూన్ 29) మధ్యాహ్నం ఆదినారాయణ అనే వ్యక్తి శేజల్ ను పెద్దమ్మ గుడి దగ్గర డ్రాప్ చేశారని తెలుస్తోంది.  శేజల్ బ్యాగులో సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.  

 

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగిక వేధింపుల కేసులో ఆత్మహత్యాయత్నం చేసిన శేజల్ ను పోలీసులు పేస్ ఆస్పత్రికి తరలించారు.  ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.   శైజల్ కి ఎమర్జెన్సీ బ్లాక్ లో చికిత్స  అందించిన వైద్యులు ..  అవుటాఫ్ డేంజర్ అని చెబుతున్నారు. ఆయుర్వేదిక్ సంబందించిన నిద్ర మాత్రలు వేసుకున్న శేజల్ మరికాసేపట్లో పేస్ వైద్యులు డిశ్చార్జ్ చేయనున్నారు. 

తనకు న్యాయం చేయాలని కోరుతూ.. ఆరిజన్ డైరీ ప్రతినిధి శేజల్ తన పోరాటాన్ని కొనసాగించారు. అయినా ఇంతవరకు  ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోకపోవడంతో బాధితురాలు శేజల్ ఆత్మహత్యా యత్నం చేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య   తనను లైంగికంగా వేధించారని శేజల్ ఆరోపించిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు పదిహేను రోజులకు పైగా  ఢిల్లీలో పోరాటం చేసిన ఆమె... జాతీయ మహిళా కమిషన్ కు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం జరగడం లేదని ఆవేనదతో గతంలో కూడా  న్యూఢిల్లీలోనే ఆత్మాహత్యాయత్నం చేయడంతో.. వెంటనే ఆమెను స్థానికులు గుర్తించి ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి నుండి  డిశ్చార్జ్ అయిన తర్వాత  ఎమ్మెల్యే చిన్నయ్యపై సీబీఐకి కూడా శేజల్ ఫిర్యాదు చేశారు. 

పోలీసులకు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే మ్యానేజ్ చేస్తున్నారని శేజల్ ఆరోపిస్తున్నారు.  అందుకు సంబందించిన ఆధారాలను సీబీఐకి ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ పోలీసు దర్యాప్తుపై నమ్మకం లేకే సీబీఐని ఆశ్రయించినట్లు చెప్పారు. పారదర్శకంగా దర్యాప్తు చేయాలనీ సీబీఐని కోరామన్నారు.  తనపై తప్పుడు కేసులు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్నారని శేజల్ కన్నీరు పెట్టుకున్నారు. తన దగ్గర ఉన్న ఆడియో టేప్స్, ఇతర ఆధారాలను సీబీఐకి అందజేశానని... సీబీఐ దర్యాప్తు చేస్తామని చెప్పిందని ఢిల్లీలో మీడియాకు తెలిపారు.

దుర్గం చిన్నయ్య అనుచరులు పదే పదే వేధిస్తున్నారంటూ   ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద శేజల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి శేజల్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. ఆపై ఆరోగ్యం కుదుటపడిన అనంతరం ఎన్‌సీడబ్ల్యూతో పాటు అనేక కమిషన్లను కలిసి తన బాధను వెల్లడించారు. గతంలొ  బీఆర్‌ఎస్ జాతీయ కార్యాలయం ఎదుట కూడా శేజల్ ధర్నా చేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వల్ల ఇబ్బందులకు గురవుతున్న మహిళలకు రక్షణ కలిపించాలని, తక్షణమే ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించి, పార్టీ నుంచి తొలగించి కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలన్నింటినీ దుర్గం చిన్నయ్య ఖండిస్తున్నారు.

ఎమ్మెల్యే చిన్నం దుర్గయ్య అధికారపార్టీకి చెందిన నేత కావడంతో ఇటు పోలీసులు, అటు ప్రభుత్వం ఆయనను కాపాడుతున్నారని శేజల్ ఆరోపించింది.  ఎమ్మెల్యేపై పోలీసులు చర్యలు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారనిచెప్పారు శేజల్.  తాను పోరాటం మొదలు పెట్టిన దగ్గరి నుంచి ఎమ్మెల్యే అనుచరులు తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు శేజల్ .  రాష్ట్ర ప్రభుత్వం తనకు న్యాయం చేయదంటూ శేజల్ సూసైడ్ నోట్ లో పేర్కొంది, రాష్ట్ర ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందని నమ్మకం లేదన్న శేజల్... ఎమ్మెల్యే చిన్నం దుర్గయ్యకే ఒత్తాసు పలుకుతుందని లేఖలో పేర్కొంది.  తాము ప్రాణాలను అరచేతిలోపెట్టుకొని బతుకుతున్నామని లేఖలో రాశారు  బాధితురాలు శేజల్.