‘కుడి భుజం మీద టీకా’.. వైరల్ అవుతున్న పేరడీ పాట

‘కుడి భుజం మీద టీకా’.. వైరల్ అవుతున్న పేరడీ పాట

ఎవరి నోట విన్నా దాని భుజం మీద కడవా పాటే వినిపిస్తోంది. లవ్ స్టోరీ సినిమాలో ఆ పాట మస్తు ఫేమస్ అయింది. ఇప్పుడు ఎవరి ఫేస్ బుక్ వాట్స్ చూసినా వారి కుడి భుజం మీద టీకా.. వ్యాధి రమ్మన్న రాదురా కాకా.. అనే పేరడీ పాటే. కరోనా టీకాపై వచ్చిన ఈ పాట మస్తు వైరల్ అవుతోంది. దాన్ని రాసింది ఎవరో కాదు స్కూల్ టీచర్ ముత్యాల రఘుపతి. వ్యాక్సిన్ పై జనాల్లో ఉన్న అపోహను పోగొట్టి వారికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పేరడీ చేసిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం గూనపర్తి గ్రామానికి చెందిన ముత్యాల రఘుపతి గవర్నమెంట్ స్కూల్ టీచర్. బడిపంతులుగా స్టూడెంట్స్కు పాఠాలు చెప్పే ఈయన పలు అంశాలపై జనంలో చైతన్యం కలిగించేందుకు కవితలు, పాటలు రాస్తారు. చిన్నప్పటి నుంచి పాటలు, సాహిత్యం పట్ల అభిమానం ఉన్న రఘుపతి ఇప్పటివరకు 200 కవితలు రాశారు. ఆయన రాసిన ‘ముత్యాల కైతికలు’ అనే పుస్తకం ‘వండర్ బుక్ ఆఫ్ రికార్డు’ల్లో చోటు దక్కించుకుంది. కాగా.. ఈ మధ్యే కరోనా టీకా వేయించుకున్న రఘుపతికి ఒక ఐడియా వచ్చింది. జనాల్లో కరోనా టీకాపై ఉన్న అపోహలను తొలగించాలని అనుకున్నాడు. అలా ‘సారంగదరియా’ పాటను పేరడీ చేసి దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఆయన పోస్ట్ చేసిన వారంలోనే ఆ పాట నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇప్పటికే చాలామంది దాన్ని పాటగా పాడి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. పాటలు రాయడంలో  ఫేమస్ అయిన రఘుపతి పిల్లలకు పాఠాలు చెప్పడంలో కూడా ఫస్టే. 2018లో ఉత్తమ టీచర్గా అవార్డు అందుకున్న రఘుపతి, 2017లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో జిల్లా స్థాయి ప్రశంసా పత్రాన్ని పొందారు.

అపోహలు తొలగించేందుకే..
ఈ నెల ఒకటో తారీఖున టీకా వేయించుకున్నాను. హాస్పిటల్లో డాక్టర్లు టీకా గురించి జనాన్ని చైతన్యపరుస్తున్న తీరు చూశాను. చాలామంది టీకాపై అపోహలతో వేయించుకోవడం లేదని తెలిసి అలాంటి వారిలో అవగాహన కల్పించాలని డిసైడ్ అయ్యాను. ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయిన ‘సారంగదరియా’ పాట అయితే బాగా ఫేమస్ అవుతుందని అనుకుని పేరడీ చేశాను. తక్కువ టైంలో ఇంత వైరల్ అవుతుందని ఊహించలేదు. -.. ముత్యాల రఘుపతి

కుడి భుజం మీద టీకా
మీరు వేసుకొనుటకిది మోకా
వ్యాధి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిడ్ టీకా
వారి ఎడమ భుజం మీద టీకా
జర వేసుకొనుడి ఇది మోకా
వ్యాధి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిట్ టీకా
పల్లవి: 
మక్కుకి కాటన్ మాస్కుల్
లేకున్న బతుకులు ముస్కిల్
చేతికి ప్లాస్టిక్ గ్లౌజుల్
లేకున్న ఉంటయ్ రిస్కుల్
అడుగడుగున కోవిడ్ ఆంక్షల్
పాటిస్తే ఉండవు చావుల్
ఒంట్లో మజిల్సు నొప్పుల్
లేకున్న జ్వరము నిప్పుల్
దివి కంటితో చూడగా తప్పుల్
తుర్రున పోతయిరా ముప్పుల్
టీకా... టీకా... టీకా
ఇది కరోనా కట్టడి మోకా
వ్యాధి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిడ్ టీకా