
- హాజరుకానున్న మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, వెలుగు: గాంధీ భవన్‌లో శుక్రవారం నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమానికి ఇరిగేషన్, సివిల్ సప్లయ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు. ప్రజలతో ముఖాముఖి నిర్వహించడంతో పాటు వారు అందించే ఫిర్యాదులను స్వీకరించి, సమస్యలను పరిష్కరించనున్నారు.
శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మంత్రి ఉత్తమ్ ఇందిరా భవన్ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. గాంధీ భవన్‌లో ప్రతి బుధ, శుక్రవారాల్లో కొనసాగనున్న ప్రజా పాలన కార్యక్రమం గత బుధవారం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రారంభించారు.