ట్విట్టర్లోకి 50 మంది కొత్తోళ్లు

ట్విట్టర్లోకి 50 మంది కొత్తోళ్లు

ట్విట్టర్ను చేజిక్కించుకున్న వెంటనే సీఈఓతో పాటు సీఎఫ్ఓను తొలగించిన ఎలాన్ మస్క్.. కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తున్నాడు. టెస్లా నుంచి 50 మంది ఉద్యోగులకు ట్విట్టర్లోకి తీసుకొచ్చాడు. వారిలో మెజార్టీ మెంబర్లు ఆటో పైలట్ బృందానికి చెందినవారే కావడం విశేషం. 50 మంది సభ్యుల్లో బోరింగ్ నుంచి ఇద్దరు, న్యూరాలింక్ నుంచి ఒకరు ఉన్నారు. మస్క్ ట్విట్టర్ లోకి తీసుకున్న ఉద్యోగుల్లో టెస్లా సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ డైరెక్టర్ భారత సంతతికి చెందిన అశోక్ ఎల్లుస్వామి, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ సీనియర్ డైరెక్టర్ మహా విర్దుహగిరి, ఆటోపైలట్, టెస్లా బాట్ ఇంజనీరింగ్ డైరెక్టర్ మిలన్ కోవాక్ ఉన్నారు.

అక్టోబర్ 28న ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ ను కొనుగోలు చేశాడు. ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన వెంటనే సీఈఓ పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెద్ సెగల్తో పాటు లీగల్అండ్ పాలసీ హెడ్ విజయ గద్దెలను పదవి నుంచి తొలగించారు. దీంతో పాటు ట్విట్టర్ వెరిఫైడ్ అకౌంట్కు ఇచ్చే బ్లూ టిక్ కోసం నెలనెలా ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించారు.