గోవా తీరంలో సెల్ఫ్ డ్రైవింగ్ ఆరస్ రోబోలు..

గోవా తీరంలో సెల్ఫ్ డ్రైవింగ్  ఆరస్ రోబోలు..

పనాజీ: బీచ్​లో సరదాగా గడిపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ సముద్రంలో గల్లంతయ్యారనే వార్తలు చదువుతూనే ఉంటాం.. ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు వెంటనే స్పందించేందుకు సరికొత్త రోబోలు వచ్చేశాయి. గోవా తీరంలో ఓ రోబో ఆల్రెడీ డ్యూటీ ఎక్కింది. ప్రమాదవశాత్తూ ఎవరైనా నీటిలో మునిగిపోతుంటే తనకు తానుగా స్పందించి, వారిని కాపాడేందుకు సముద్రంలోకి డైవింగ్​ చేస్తుంది. ఈ రోబోకు అధికారులు ‘ఆరస్’ అని పేరుపెట్టారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)  సాంకేతికతతో ప్రత్యేకంగా తయారుచేసిన రోబో ఇది. గోవా బీచ్​కు వచ్చే టూరిస్టుల భద్రత కోసం అక్కడి ప్రభుత్వం ఏఐ మానిటరింగ్ సిస్టమ్ ట్రిటాన్ తో పాటు ‘ఆరస్’ హెల్ప్ తీసుకుంటున్నది.

మానిటరింగ్​ కోసం ట్రిటాన్ సిస్టమ్​

గోవా బీచ్​కు ప్రతీ ఏడాది డొమెస్టిక్​తో పాటు ఫారిన్ టూరిస్టుల తాకిడి పెరుగుతున్నది. ఎంజాయ్ చేద్దామని నీళ్లలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నదని దృష్టి మెరైన్ తెలిపింది. గోవా కోస్టల్ బెల్ట్ ఏరియాలో రెండేండ్లలో వెయ్యి కంటే ఎక్కువ మందిని రెస్క్యూ చేశామని లైఫ్​గార్డ్​ ఏజెన్సీ చెప్పింది. ‘ఆరస్’ సెల్ఫ్​ డ్రైవింగ్​ రోబో అని, నాన్​ స్విమ్మింగ్ జోన్స్​లో పెట్రోలింగ్ చేస్తుంటుందని తెలిపింది. అలల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు టూరిస్టులను అలర్ట్​ చేస్తుందని వివరించింది. లైఫ్ సేవర్​గా సేవలు అందిస్తుందని, బీచ్​లో సర్వైలైన్స్​తో పాటు క్రౌడ్ మేనేజ్​మెంట్​ పెంచడానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. ఇప్పటికైతే నార్త్ గోవాలోని మిరామర్​ బీచ్​లో ‘ఆరస్’ సేవలు అందుతున్నాయి. ట్రిటాన్​ మానిటరింగ్​ సిస్టమ్​ను సౌత్​ గోవాలోని బైనా, వెల్సానో, బెనౌలిమ్, గల్గిబాగ్, నార్త్​ గోవాలోని మోర్జిమ్​లో అందుబాటులోకి తీసుకొచ్చారు.