సెల్ఫ్ ​లాక్​డౌన్​ ఒక్కటే రక్షణ కవచం

సెల్ఫ్ ​లాక్​డౌన్​ ఒక్కటే రక్షణ కవచం

లాక్​డౌన్​తో ఇన్నాళ్లూ అందరికీ ఇల్లే అన్నీ. షాపింగులు లేవు.. సరదా షికార్లు లేవు. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు.  కరోనాతో కలిసి బతకాల్సిందేనని పీఎం, సీఎం చెబుతున్నరు. ఈ పరిస్థితుల్లోనే పూర్తి స్థాయిలో దాదాపు అన్నింటినీ తెరుస్తున్నరు. దీంతో ఎవరికి వారు సెల్ఫ్​ లాక్​డౌన్​ను పాటించడ మొక్కటే రక్షణ కవచం.

  • మరీ అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు.
  • చాలా మంది ఫ్రెండ్స్​తో కలిసి సరదా కోసం బయటకు వెళుతుంటారు.  ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి వాటికి దూరంగా ఉంటేనే మంచిది.

ఏదైనా వస్తువు కొనాలనుకుంటే తప్ప షాపింగ్​మాల్స్​కు వెళ్లకపోతేనే మనకు, పక్కవాళ్లకు మంచిది. వీకెండ్​ వస్తే చాలా మంది రెస్టారెంట్​ ఫుడ్​వైపే చూస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత వరకు రెస్టారెంట్లకు దూరంగా ఉండాలి. ఎలాగూ ఈ లాక్​డౌన్​ టైంలో చాలా మంది వంట ట్రయల్స్​ చేసి చేతులు కాల్చుకునే ఉంటారు కదా. కాబట్టి, ఇప్పుడూ అదే ఫాలో అయితే బాగుంటుంది. ఇంటి తిండికే ఇంపార్టెన్స్​ ఇవ్వాలి. అంతగా తినాలనిపిస్తే డైన్​ఇన్​ కాకుండా టేక్​అవే (పార్సిళ్లు) తీసుకుని ఇంటి దగ్గర తింటే ఇంకా బెటర్​. కరోనాతో ఇన్నాళ్లూ గుళ్లు, ప్రార్థనా మందిరాలు క్లోజ్​ అయ్యాయి. ఇప్పుడు అవీ తెరుచుకుంటున్నాయి. అయితే, అక్కడికి ఎక్కువ మంది వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి గుడికి వెళితే దేవుడికి దండం పెట్టుకుని వీలైనంత తొందరగా ఇంటికి వచ్చేయాలి. దేవుడి దర్శనం తర్వాత చాలా మంది కాసేపు గుళ్లో కూర్చుని వస్తుంటారు. ఈ టైంలో దానిని అవాయిడ్​ చేయాలి.

 

హోటల్ కు వెళ్తే మొత్తం డీటైల్స్ ఇవ్వాలి