
ధనవంతులు కావాలని ఎవరికి ఉండదు చెప్పండి. ..అయితే జీవితంలో ఐదు చిట్కాలను ఉపయోగిస్తే మీరు ధనవంతులు కావొచ్చని జోనాథన్ శాంచెజ్ చెబుతున్నారు. ఎంత కష్టపడి సంపాదిస్తామో.. ఆలోచనాత్మకంగా ఖర్చు చేయడం కూడా ముఖ్యమైనని జోనాథన్ శాంచెజ్ చెప్పే మాట. డబ్బు ఖర్చు చేయడం అనేది సాధారణం. కానీ ఎలా ఖర్చు చేస్తున్నామనేదే ముఖ్యం. ఒక వ్యక్తి ధనవంతుడు కావాలంటే, డబ్బును ఎలా ఆదా చేయాలో, ఎలా ఖర్చు చేయాలో తెలుసుకోవాలని జోనాథన్ శాంచెజ్ చెప్పాడు. జీవితంలో ఐదు చిట్కాలను పాటిస్తే చాలా త్వరగా ధనవంతులుగా మారవచ్చని మిలియనీర్ జోనాథన్ శాంచెజ్ చెబుతున్నారు.
మంచి భవిష్యత్ కోసం డబ్బును ఆదా చేసుకోండి. డబ్బును సద్వినియోగం చేసుకోవాలని మిలియనీర్ జోనాథన్ శాంచెజ్ చెప్పారు. అయితే సురక్షితమైన భవిష్యత్తు కోసం అనవసరమైన ఖర్చులను అరికట్టడం చాలా ముఖ్యమంటూ తాను మిలియనీర్ ఎలా అయ్యారో జోనాథన్ శాంచెజ్ ఐదు చిట్కాలు చెప్పుకొచ్చారు.
ఎవరికైనా కొంత డబ్బు చేతిలో ఉందంటే లగ్జరీ వస్తువులను కొనేందుకు జనాలు ఆశక్తిని చూపుతారు. అయితే బండి కొందామా... కారు కొందామా అని జనాలు ఆలోచిస్తుంటారు. కాని ఈ ఆలోచన తప్పు అంటున్నారు జోనాథన్ శాంచెజ్. కార్ల ధరలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పెరుగుతున్నాయి. వీటితో పాటే వాటి మెయింటెనెన్స్, నిర్వహణ కూడా ఆర్థికంగా భారం అవుతుంది. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా అని కారు కొంటే అది కాస్త ఆర్థికంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అలా కారుపై పెట్టే పెట్టుబడిని సేవింగ్స్ చేస్తే ఎంతో ఉపయోగం కదా.. ఒకవేళ కారు తప్పనిసరి అనిపిస్తే సెకండ్ హ్యాండ్ కారు కొనడం మంచిదని మిలియనీర్ జోనాథన్ శాంచెజ్ సూచిస్తున్నారు.
రెండో విషయానికొస్తే బ్రాండెడ్ దుస్తులు కొనవద్దంటున్నారు జోనాథన్. బ్రాండెడ్ దుస్తుల ట్రెండ్ చాలా త్వరగా మారిపోతుంది. వాటి బదులు మామూలు బట్టలు కొనుక్కొంటే రేటు చాలా తక్కువుగా ఉంటాయి. అవి చినిగిపోయే వరకు వాడవచ్చు. అదే బ్రాండెడ్ దుస్తులు ఎక్కువకాలం వచ్చినా.. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ బట్టలు వస్తాయి కాబట్టి అన్ని రోజులు వాడలేమంటున్నారు జోనాథన్ .
మూడో విషయానికొస్తే ఇంట్లో వస్తువులు కొనేటప్పుడు అవి ఎంత వరకు ఉపయోగమో తెలుసుకోవాలి. అవసరానికి మించిన వస్తువులు కొనవద్దంటున్నారు జోనాథన్ . వంట సామాగ్రిని ఎక్కువ తీసుకుంటే అవి పాడయిపోయే అవకాశం ఉంది. అప్పుడు వాటిని డస్ట్ బిన్ లో వేయాలి. అప్పడు డబ్బు చాలా వృధా అవుతుంది. కాబట్టి ఎంత అవసరమో అంతే కొనుగోలు చేయాలని జోనాథన్ సూచిస్తున్నారు.
నాల్గవ చిట్కా: సోఫా, ఫ్రిజ్ లాంటి వస్తువులను కొనేటప్పుడు వాటి నాణ్యతను పరిశీలించి తీసుకోవాలంటున్నారు జోనాథన్. నాణ్యత బాగుంటే ఎక్కువ కాలం ఉంటుంది. నాణ్యత లేకపోతే త్వరగా పాడయిపోయి మళ్లీ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. దీనికి ఎక్కువ డబ్బు ఖర్చు కావడంతో ఆర్థికంగా ప్రభావం పడుతుంది.
ఐదో చిట్కా: కొంతమంది డబ్బును ఎక్కువ సంపాదించడానికి ఓటీ డ్యూటీ చేస్తుంటారు. అయితే కంటిన్యూగా అదనపు గంటలు పనిచేస్తే అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది, డబ్బు వస్తుంది.. ఆదా చేసుకోవచ్చు అని భావిస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. మీకు సమయం ఉంటే ఇంట్లో తోటపని లాంటివి చేసి అదనంగా డబ్బు సంపాదించమంటున్నారు మిలియనీర్ జోనాథన్ శాంచెజ్ . .
డబ్బు ఎల్లప్పుడూ సరైన మార్గంలో సంపాదించాలి. ఎందుకంటే తప్పుగా సంపాదించిన డబ్బు కొద్దికాలం మాత్రమే ఉంటుంది. , అనైతిక పద్ధతుల ద్వారా సంపాదించిన సంపాదన చాలా త్వరగా నాశనం అవుతుంది. అటువంటి డబ్బు జీవిత కాలం... కేవలం పది సంవత్సరాలు మాత్రమే. ఈ పదేళ్లలో కూడా మనిషి సంపద నీరులా ప్రవహిస్తుంది. ఒకదానికొకటి అనవసరంగా ఖర్చు పెడతారు. అందుకే మంచి మార్గంలో డబ్బు సంపాదించాలి. మంచి కోసం డబ్బు ఖర్చు చేయాలి.