
పద్మారావునగర్, వెలుగు: గణేశ్ ఉత్సవాల సందర్బంగా ఇటీవల ఎర్రగడ్డలో పలువురు విగ్రహాలను విక్రయించారు. అమ్ముడుపోగా, మిగిలిన వాటిని అక్కడే రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా పడేసి వెళ్లారు.
దీనిని గమనించిన భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సనత్ నగర్ సభ్యులు.. సోమవారం డీసీఎం వ్యాన్‌లో సుమారు 15 విగ్రహాలను సనత్ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని బేబీ వాటర్ పాండ్, మూసాపేట ఐడీఎల్ చెరువులో సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఎన్. సతీశ్, సాయి ప్రకాశ్, రణ్ వీర్, బవేశ్ పటేల్, కార్తీక్ పాల్గొన్నారు.