ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ఖైదీల బిర్యానీ..

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ఖైదీల బిర్యానీ..

త్రిస్సూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: రోజు రోజుకు క్రేజ్‌‌‌‌‌‌‌‌ పెరుగుతున్న ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ఫుడ్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి ఖైదీలు కూడా ఎంటరయ్యారు. జైల్లో తాము ప్రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్న ఫుడ్‌‌‌‌‌‌‌‌ను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ యాప్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా భోజన ప్రియులకు అందిస్తున్నారు. కేరళలోని వియ్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంట్రల్‌‌‌‌‌‌‌‌ జైల్‌‌‌‌‌‌‌‌లో ఖైదీలు తయారు చేసే బిర్యానీని ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అమ్ముతున్నారు. మొదటి ఫేజ్‌‌‌‌‌‌‌‌లో భాగంగా రూ.127తో బిర్యానీ కాంబోను ‘స్విగ్గీ’ ద్వారా ఫుడ్‌‌‌‌‌‌‌‌లవర్స్‌‌‌‌‌‌‌‌కు అందిస్తున్నారు. సెంట్రల్‌‌‌‌‌‌‌‌ జైల్‌‌‌‌‌‌‌‌లోని ఖైదీలు 2011లోనే ‘ఫ్రీడమ్‌‌‌‌‌‌‌‌ ఫుడ్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ’ పేరుతో ఫుడ్‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌ చేశారు. కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేల్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా రోటీలు, రకరకాల బిర్యానీ, బేకరీ ఐటమ్స్‌‌‌‌‌‌‌‌ తయారు చేసి అమ్ముతున్నారు. “ మొదటిసారి మేము ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లోకి ఎంటరయ్యాం. జైల్‌‌‌‌‌‌‌‌ డీజీపీ రిషిరాజ్‌‌‌‌‌‌‌‌ సింగ్ ఈ ఐడియా ఇచ్చారు. జైల్‌‌‌‌‌‌‌‌లో కమర్షియల్‌‌‌‌‌‌‌‌ స్కేల్‌‌‌‌‌‌‌‌ బేసిస్‌‌‌‌‌‌‌‌ మీద చపాతీలు అమ్ముతున్నాం. తక్కువ ఖర్చుతో మంచి ఫుడ్‌‌‌‌‌‌‌‌ అందించడం వల్ల జనం బాగా ఆదరించారు. ప్రస్తుతానికి బిర్యానీ మాత్రమే ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ఇస్తున్నాం.. త్వరలో మిగతా ఫుడ్‌‌‌‌‌‌‌‌ ఐటమ్స్‌‌‌‌‌‌‌‌ కూడా పెడతాం. కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేల్స్‌‌‌‌‌‌‌‌ కంటిన్యూ చేస్తాం” అని వియ్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంట్రల్‌‌‌‌‌‌‌‌ జైల్‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ నిర్మలానందన్‌‌‌‌‌‌‌‌ నాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. జైలు జీవితం ఎలా ఉంటుందో చూడాలనుకునే సామాన్యుల కోసం త్వరలోనే ‘పే అండ్‌‌‌‌‌‌‌‌ స్టే’ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర  జైళ్ల శాఖ ఆలోచిస్తోంది.