ముషీరాబాద్,వెలుగు: దేశ అమూల్య సంపదైన ఐడీబీఐ బ్యాంకును అడ్డగోలుగా అమ్మడం దేశద్రోహమే అవుతుందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) జాతీయ అధ్యక్షుడు బి.ఎస్. రాంబాబు ఆరోపించారు. లక్ష కోట్లకు పైగా విలువైన బ్యాంకును రూ. 52,878 కోట్ల ప్రతిఫలంతో 60.72% వాటాను అమ్మడం దుర్మార్గమన్నారు.
ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేయాలని, పార్లమెంటరీ పర్యవేక్షణలో సమగ్ర సమీక్ష జరపాలని ఐడీబీఐ అధికారులు ఉద్యోగుల ఐక్య వేదిక (యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఐడీబీఐ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్) ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద సోమవారం నిరాహార దీక్ష చేశారు. ప్రొఫెసర్ కె నాగేశ్వర్, రాష్ట్ర కన్వీనర్ ఆంజనేయ ప్రసాద్, వెంకట్రామయ్య, భరత్ పాల్గొన్నారు.
