ఈసారి ‘నేనే వస్తున్నా మూవీ ఈ నెల 29న రిలీజ్

ఈసారి ‘నేనే వస్తున్నా మూవీ ఈ నెల 29న రిలీజ్

 

  • రొటీన్‌కి భిన్నమైన చిత్రాల్ని తీసే సెల్వ రాఘవన్.. 
  • ఈసారి ‘నేనే వస్తున్నా’ మూవీని తెరకెక్కించారు. 
  • ఆయన తమ్ముడు ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమా
  • ఈ నెల 29న విడుదలవుతున్న సందర్భంగా 
  • కాసేపు ఇలా కబుర్లు చెప్పారు సెల్వ.

‘‘ధనుష్‌‌‌‌తో గతంలో మూడు సినిమాలు చేశాను. పదకొండేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడీ సినిమా తీశాను. ఈ గ్యాప్‌‌‌‌లో తను బాలీవుడ్‌‌‌‌కి, హాలీవుడ్‌‌‌‌కి కూడా వెళ్లిపోయాడు. మేమిద్దరం కలిసి సినిమా చేయాలనేది మా అమ్మ కోరిక. తన కోసమే ఈ మూవీ. అలాగే ధనుష్‌‌‌‌ కూడా మేమిద్దరం కలిసి ఓ సినిమా రాయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఇప్పటికి కుదిరింది. తను చాలా మంచి రైటర్. అందుకే ఎప్పుడూ ఎవరితో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేయని నేను మొదటిసారి తనతో కలిసి ఈ సినిమా రాశాను.  యువన్ శంకర్‌‌‌‌‌‌‌‌ రాజా నాకు మరో బ్రదర్. ఇరవై రెండేళ్లుగా తనతో కలిసి వర్క్ చేస్తున్నా. అంటే ముగ్గురు బ్రదర్స్ కలిసి తీసిన సినిమా ఇది. ధనుష్‌‌‌‌ చేసిన రెండు పాత్రలే ఈ సినిమాకి ప్రాణం. డిఫరెంట్ లుక్స్, డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి.

నేను కూడా ఓ చిన్న రోల్ చేశాను. ఈమధ్య యాక్టింగ్‌‌‌‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నానని కొందరు అనుకుంటున్నారు. నిజానికి అవన్నీ అనుకోకుండా చేయాల్సి వచ్చిందే తప్ప కావాలని నేనెప్పుడూ ఏ పాత్రలోనూ నటించలేదు. ఇందులో కూడా ధనుష్ చేయమంటే చిన్న క్యారెక్టర్ చేశాను అంతే. ప్రొడ్యూసర్ కలైపులి థాను ఈ మూవీ విషయంలో చాలా ఎక్సైటవుతున్నారు. తెలుగులో గీతా ఆర్ట్స్ రిలీజ్ చేయడం  హ్యాపీగా ఉంది. ఓ మంచి కథ ఉంటే చెప్పండి అని అల్లు అరవింద్‌‌‌‌ అడిగారు కూడా. ఓ ఫిల్మ్ మేకర్‌‌‌‌‌‌‌‌గా నేను కంటెంట్‌‌‌‌ బేస్డ్‌‌‌‌ సినిమాల్ని ఇష్టపడతాను. కమర్షియల్ చిత్రాలూ చేయాలనుకుంటున్నాను. పుష్ప, ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ లాంటి చిత్రాలు ఈ రెండు కేటగిరీలకూ చెందినవి. బలమైన కంటెంట్‌‌‌‌తో కమర్షియల్‌‌‌‌ హిట్టు కొట్టాయి. నాకు కూడా అలాంటి సినిమాలు  ఇష్టం.’’