సెమీకాన్ ఇండియా రిజిస్ట్రేషన్లు షురూ

సెమీకాన్ ఇండియా  రిజిస్ట్రేషన్లు షురూ

హైదరాబాద్​, వెలుగు: సెమీ ఇండియా, సెమీకండక్టర్ మిషన్ సంయుక్తంగా నిర్వహించనున్న సెమీకాన్​ ఇండియా 2025 కార్యక్రమానికి విజిటర్స్​ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఈ  సదస్సు,  ఎగ్జిబిషన్ 2025 సెప్టెంబర్ 2 నుండి 4వ తేదీ వరకు  ఢిల్లీలోని యశోభూమి ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌‌‌‌పో సెంటర్ (ఐఐసీసీ) లో జరగనుంది. 

"బిల్డింగ్ ది నెక్స్ట్ సెమీకండక్టర్ పవర్‌‌‌‌హౌస్"  అనే థీమ్‌‌‌‌తో జరుగుతున్న ఈ ఈవెంట్, మైక్రోఎలక్ట్రానిక్స్,  సెమీకండక్టర్ వాల్యూ చెయిన్​లో భారతదేశ సామర్థ్యాలను ప్రదర్శించనుంది. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ డిజైన్,  తయారీ ఎకోసిస్టమ్‌‌‌‌లోని నిపుణులను, పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఆసక్తి గల వారు సెమీకాన్​ ఇండియా 2025 వెబ్‌‌‌‌సైట్ ద్వారా తమ పేర్లను రిజిస్టర్​ చేసుకోవచ్చు.