V6 News

ఎంత బలుపు, కొవ్వెక్కితే ఇలాంటి మాటలు మాట్లాడతాడు: షాకింగ్ గా TCS బాధితుడి కంప్లయింట్..!

ఎంత బలుపు, కొవ్వెక్కితే ఇలాంటి మాటలు మాట్లాడతాడు: షాకింగ్ గా TCS బాధితుడి కంప్లయింట్..!

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ బ్రాంచ్‌ లైంగిక వేధింపుల కేసులో నిందితుల ఆగడాలు ఒక్కోటిగా బయటపడుతున్నాయి. నిందితుల్లో ఒకరైన టీం లీడ్ తనను దారుణంగా వేధించాడని.. నీకు పిల్లల్లేరు.. బిడ్డలు  కావాలంటే  భార్యను పంపించమని అభ్యంతరకరమైన వ్యక్తిగత వేధింపులకు టీసీఎస్ లో టీం లీడర్ తో సహా మరో ఉద్యోగి గురిచేశారని  ఓ కంపెనీ ఉద్యోగి ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

 టీసీఎస్ నాసిక్ బ్రాంచిలో పనిచేస్తున్న టీం లీడర్ తౌసిఫ్ అక్తర్, మరో  ఉద్యోగి డానిష్ షేక్ తనను అత్యంత దారుణంగా వేధించారని బాధిత ఉద్యోగి వాపోయాడు. చాలా రోజులుగా తనకు పిల్లలు లేరని.. ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా మీకు పిల్లలు పుట్టడం లేదని తెలిసి.. తనను మానసికంగా వేధించాడని వాపోయాడు. నీ భార్యను నా దగ్గరకు పంపించు అంటూ దారుణంగా వేధించారు.. ఈ క్రమంలో తౌసిఫ్ తో జరిగిన గొడవలో తనను చంపుతానని బెదిరించాడు, ఈ విషయాన్ని హెచ్ ఆర్ కు కంప్లయింట్ చేశానని బాధితుడు గోడు వెల్లబోసుకున్నాడు. 

అంతేకాదు  టీసీఎస్ నాసిక్ బ్రాంచిలో మతమార్పిడి ఒత్తిడి కూడా ఉందని ఆరోపించాడు బాధిత ఉద్యోగి. కంపెనీలో చేరిన కొద్ది కాలానికే ఈ వేధింపులు మొదలయ్యాయని  అన్నారు. ఇష్టానికి వ్యతిరేకంగా మతపరమైన ఆచారాలు పాటించాలని ఒత్తిడి చేసేవాడని ఫిర్యాదు చేశాడు. 

►ALSO READ | జెమిని, జీపీటీ-5.2, క్లాడ్ AIల చేతికి అణుబాంబులు ఇస్తే ఏమవుతుంది? షాకింగ్ నిజాలు బయటపెట్టిన రీసెర్చ్

టీం లీడ్ స్థాయిలోఉండి తనపై ఆదేశాలను పాటించేలా బలవంతం చేసేవాడని, ఇతర ఉద్యోగుల వర్క్ కూడా ఇచ్చి పనిభారం మోపారని నిందితులు తౌసిఫ్ , డానియల్ షేక్ పై ఆరోపణలు ఉన్నాయి. నిందితుల్లో ఒకరైన డానియల్ షేక్  పై ఓ మహిళ ఉద్యోగి లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడని.. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఫిర్యాదులో తెలిపింది. 

టీసీఎస్‌ నాసిక్‌ క్యాంపస్‌ వ్యవహారం సంచలనంగా మారింది. లైంగిక వేధింపులు, మత మార్పిడులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కొంతమంది ఉద్యోగులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హెచ్‌ఆర్‌ మేనేజర్‌ సహా ఏడుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన ఉద్యోగులను సస్పెండ్‌ చేశామని టీసీఎస్ తెలిపింది. పని ప్రదేశంలో ఇలాంటి వేధింపులను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేసింది.