సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నిక

సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నిక

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ అడ్వకేట్ నూకల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఈ ఎన్నికల్లో పోటీపడిన మరో న్యాయవాది జటంగి వెంకటేశ్వర్లుపై 24 ఓట్ల అధిక్యంతో సుదర్శన్ రెడ్డి విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా ఎంఎన్ వరప్రసాద్ సమీప అభ్యర్థి మురళిపై గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా డి.మల్లయ్య ఎన్నికయ్యారు.

సంయుక్త కార్యదర్శిగా పి. వాణి, ట్రెజరర్ గా డి. వీరేశ్​కుమార్, గ్రంథాలయ కార్యదర్శిగా మహమ్మద్ అబ్దుల్ లతీఫ్,  క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా  జె. చంద్రమౌళి, కార్యవర్గ సభ్యులుగా చంద్రమౌళి, సుంకర రవి, డి. వెంకట్ రెడ్డి, కె. వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నూకల సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నేతలు కొప్పుల వేణారెడ్డి, పోలెబోయిన నర్సయ్య యాదవ్, ఇతర న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో న్యాయవాదులు విజయ్, సాయి నేత, కరుణాకర్ రెడ్డి, రమేశ్, సోమేశ్వర్, వెంకటేశ్వర్లు, బాలరాజు, రఘురామయ్య, సందీప్, రాధాకృష్ణ, యాదగిరి, గండూరి రమేశ్ పాల్గొన్నారు.

కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎస్ఆర్ కే మూర్తి ఎన్నిక 

కోదాడ, వెలుగు :  కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది శ్రీనివాసుల రాధాకృష్ణ మూర్తి (ఎస్ ఆర్ కే మూర్తి ) ఎన్నికయ్యారు. గురువారం కోదాడ బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో ఆయన 59 ఓట్ల మెజార్టీతో నాళం రాజన్నపై విజయం సాధించారు. మొత్తం 106 ఓట్లు పోల్ కాగా, అందులో ఒక ఓటు చెల్లలేదు. ఎస్ ఆర్ కే మూర్తి కి 82 ఓట్లు రాగా, రాజన్నకు 23 వోట్లు వచ్చాయి.  క్రీడా కార్యదర్శిగా పోలురి హేమలత 18 ఓట్ల మెజార్టీతో, 1వ కార్యవర్గ సభ్యుడిగా దొడ్డ శ్రీధర్ 8 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 

నూతన కార్యవర్గం.. 

కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎస్ఆర్ కే మూర్తి,  ఉపాధ్యక్షుడిగా గట్ల నర్సింహారావు, ప్రధాన కార్యదర్శిగా చింతకుంట్ల రామిరెడ్డి, సంయుక్త కార్యదర్శిగా సరికొండ హనుమంత్ రాజు, కోశాధికారిగా కోడూరు వెంకటేశ్వరరావు, గ్రంథాలయ కార్యదర్శిగా మందా వెంకటేశ్వర్లు, క్రీడా కార్యదర్శిగా పోలూరి హేమలత, మహిళా ప్రతినిధిగా ఓరుగంటి ధనలక్ష్మి, కార్యవర్గ సభ్యులుగా దొడ్డ శ్రీధర్, సామా నవీన్ కుమార్, షేక్ నాగుల పాషా ఎన్నికయ్యారు.

నూతన కార్యవర్గానికి సీనియర్ న్యాయవాదులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, దేవబత్తిని నాగార్జునరావు, మేకల వెంకట్రావు, ఎలక సుధాకర్ రెడ్డి, పాలేటి నాగేశ్వర రావు, రామిశెట్టి రామకృష్ణ, పగడాల రామచంద్రా రెడ్డి, కాకర్ల వెంకటేశ్వరరావు, సాధు శరత్ బాబు,ఈడుల కృష్ణయ్య, గాలి శ్రీనివాస్ నాయుడు అభినందనలు తెలిపారు. 

హుజూర్​నగర్​ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సాముల రామిరెడ్డి 

హుజూర్ నగర్ , వెలుగు : హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు గురువారం కోర్టు ప్రాంగణంలో పదవి స్వీకారప్రమాణం చేశారు. అంతకుముందు న్యాయవాదులు ప్రొటెం స్పీకర్ గా సీనియర్ న్యాయవాది కాల్వ శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బార్​అసోసియేషన్​ అధ్యక్షుడిగా సాముల రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జక్కుల వీరయ్య

సంయుక్త కార్యదర్శులుగా భూక్య నాగేష్ రాథోడ్, కానూరు ప్రదీప్తి, గ్రంథాలయ కార్యదర్శిగా చిత్రం విశ్వనాథం, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా గుగులోతు వెంకటేశ్​నాయక్, కార్యవర్గ సభ్యులుగా ఉదారి యాదగిరి, కమతం నాగార్జున, షేక్ సైదా హుస్సేన్, నాగేందర్ నాయక్, గొట్టే ప్రశాంత్, తండు హరికృష్ణ, రామినేని వెంకటేశ్​ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య ఎన్నికల అధికారి మంత్రి ప్రగడ సుందర రాఘవరావు, సహాయ ఎన్నికల అధికారి వట్టికూటి అంజయ్య  ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు ఎన్నిక ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.