ఎండోమెంట్‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా శైలజ..అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ఎండోమెంట్‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా శైలజ..అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: సీనియర్ ఐఏఎస్ అధికారి శైలజా రామయ్యర్‌‌‌‌కు ఎండోమెంట్‌‌‌‌ కమిషనర్‌‌‌‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులిచ్చారు. 1997 బ్యాచ్‌‌‌‌కు చెందిన శైలజా రామయ్యర్ ప్రస్తుతం ఎండోమెంట్​ ప్రిన్సిపల్​ సెక్రటరీగా, చేనేత, జౌళి, హస్తకళలు, ఐ అండ్​ సీ విభాగాలకు ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా ఎండోమెంట్​ కమిషనర్ పదవికి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు.