సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గుండెపోటుతో మృతి

సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గుండెపోటుతో మృతి

పంజాగుట్ట, వెలుగు: సీనియర్ జర్నలిస్ట్, సినీ దర్శకుడు కె. జయదేవ్ గుండెపోటుతో సోమవారం హైదరాబాద్​లోని ఓ హాస్పిటల్​లో మృతి చెందారు. జయదేవ్ దర్శకత్వం వహించిన  ‘ కోరంగి' చిత్రాన్ని జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ నిర్మించింది.  

ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ  చలన చిత్రోత్సవాల్లో  ప్రదర్శితమైంది.  భారతరత్న సీఎన్​ఆర్ రావ్​పై ఫిల్మ్ డివిజన్​కు డాక్యుమెంటరీని సైతం నిర్మించారు. ప్రముఖ సినీ జర్నలిస్ట్ కేఎన్టీ శాస్త్రికి జయదేవ్​ చిన్న కుమారుడు. జయదేవ్​కు భార్య యశోద, కొడుకు, కుమార్తె ఉన్నారు.