
కోల్ బెల్ట్, వెలుగు: సీనియర్ జర్నలిస్ట్ ఎండీ మునీర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ మందమర్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళ వారం రాత్రి పట్టణంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అబ్రహం విగ్రహం వద్ద నుంచి మార్కెట్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. చిన్ననాటి నుంచే భూస్వాములు, దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మునీర్ నాలుగు దశాబ్దాలుగా సింగరేణి కార్మిక వర్గం హక్కుల కోసం పోరాడారని ఆయన గుర్తుచేసుకున్నారు.
మలిదశ ఉద్యమంలో 40 వేల మంది గని కార్మికులను ఏకతాటిపై తీసుకొచ్చి సింగరేణి జేఏసీ కన్వీనర్‌గా సకలజనుల సమ్మెను విజయవంతం చేయడంలో మునీర్ పాత్ర గొప్పదని కొనియాడారు. అన్ని రాజకీయ, కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాల బాధ్యులు, సింగరేణి కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు.