
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి సీనియర్ జర్నలిస్టు ఎల్ నారాయణ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 2025 సెప్టెంబర్ 11వ తేదీ (గురువారం) ఉదయం తన స్వగ్రామం మిట్టపల్లి లోని ఇంట్లో ఉన్న సమయంలోనే ఆయన కుప్పకూలిపోయారు. ఆయన ప్రస్తుతం ఆంధ్రజ్యోతి విలేఖరిగా పనిచేస్తున్నారు. 1996 లో ఈనాడు విలేకరిగా ప్రస్థానం ప్రారంభించిన నారాయణ ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలో చేరారు. 20 ఏండ్లుగా ఆంధ్రజ్యోతిలో సేవలందిస్తున్నారు. పాత్రికేయ విలువలకు కట్టుబడి జీవనయానం సాగించారు.
ఆయనకు భార్య లక్ష్మి, కుమారుడు సాయికిరణ్, కుమార్తె సౌజన్య ఉన్నారు. సాయికిరణ్ ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. గురువారం రాత్రికి ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. శుక్రవాం (సెప్టెంబర్ 12) ఉదయం స్వగ్రామం మిట్టాపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
నారాయణ మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీల నాయకులు, జర్నలిస్టులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ పై ఉత్తమ కథనాలు అందించారని పలువురు ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నాయకులు గుర్తు చేసుకున్నారు.