లీడర్లు లూటీలు చేస్తే.. లాఠీలు పడదాం

లీడర్లు లూటీలు చేస్తే.. లాఠీలు పడదాం
  • సీనియర్​ జర్నలిస్ట్​ పాశం యాదగిరి

కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రజాస్వామిక తెలంగాణ కోసం కలిసి ఉద్యమిద్దామని సీనియర్​జర్నలిస్ట్ పాశం యాదగిరి పిలుపునిచ్చారు. నేతలు లూటీలు చేస్తే లాఠీలు పడదామని చెప్పారు. కరీంనగర్​లో మంగళవారం తెలంగాణ ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో మీటింగ్ ​జరిగింది. అనంతరం వేదిక నిర్వాహకుడు గాదె ఇన్నయ్యతో కలిసి యాదగిరి మీడియాతో మాట్లాడారు. గల్లీలో లొల్లి పెడితేనే ఢిల్లీలో బిల్లు పెట్టారన్నారు. తెలంగాణ వచ్చినా సొంతిట్లో పరాయివాళ్లలా బతకాల్సి వస్తోందని, పిడికిలి బిగించి కొట్లాడదామని పిలుపునిచ్చారు. కృష్ణా నీళ్లను ఆంధ్రాకు మళ్లిస్తున్నారని, గుట్టల్ని కరిగిస్తున్నారని మండిపడ్డారు. మలి ఉద్యమానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి రావాలని కోరారు. రాష్ట్రంలో ఓపెన్ కాస్ట్ మైన్లు వద్దన్న సీఎం కేసీఆర్ నేడు మేడిపల్లి, తాతారావుపేట, ఎర్రగుంటపల్లిలో ఎలా మొదలుపెట్టారని ప్రశ్నించారు. ఒక్క మంత్రి బయటకు వెళ్తే దళితబంధు వచ్చిందని, సీఎం ఫాం హౌజ్ నుంచి ప్రగతిభవన్ కు వచ్చాడన్నారు. హుజురాబాద్​లో ఓడిపోతే సచివాలయానికి కూడా వస్తాడన్నారు.