
హైదరాబాద్: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని అపోలో హాస్పిటల్ వైద్యులు చెబుతున్నారు. కొద్దిసేపటి క్రితం కైకాల ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ ప్రకటించారు. వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించేందుకు వైద్య బృందం తీవ్రంగా శ్రమిస్తోందని తెలిపారు. గత కొంత కాలంగా కరోనా అనంతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన ఇవాళ ఉదయం 7.30 గంటలకు హాస్పిటల్‌లో చేరినట్లు వివరించారు. పలు అవయవాలు పనిచేయడం లేదని.. అందువల్ల ఆయన ఆరోగ్య పరిస్థితిని సాధారణ స్థాయికి తెచ్చేందుకు వైద్యుల బృందం పనిచేస్తోందని వివరించారు.