IND vs ENG 2025: ఒత్తిడిలో యువ సారధి.. గిల్‌కు కోహ్లీ, రోహిత్, ధోనీ కీలక సలహాలు

IND vs ENG 2025: ఒత్తిడిలో యువ సారధి.. గిల్‌కు కోహ్లీ, రోహిత్, ధోనీ కీలక సలహాలు

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒక దశాబ్దానికి పైగా టీమిండియా టెస్టు జట్టుకు మహాస్తంభాలుగా నిలిచారు. బ్యాటర్లుగానే కాకుండా నాయకులుగా ఎన్నో గొప్ప విజయాలు అందించారు. ఇప్పుడు ఈ ఇద్దరూ లేకుండా ఒక దశాబ్దం తర్వాత టీమిండియా  అత్యంత కఠినమైన ఇంగ్లండ్ టూర్‌‌‌‌కు సిద్ధమైంది. ఐదు టెస్టుల సిరీస్  ఈనెల 20 నుంచి జరిగే తొలి మ్యాచ్‌‌తో షురూ అవుతోంది. కోహ్లీ, రోహిత్  వంటి లెజెండ్స్ టెస్ట్ జట్టులో లేని ఈ తరుణంలో ఇండియా బ్యాటింగ్ భవిష్యత్తు ఇప్పుడు యువ భుజాలపై పడ్డాయి. 

ముఖ్యంగా కెప్టెన్ గిల్ కు ఈ సిరీస్ సవాలుగా మారింది. రోహిత్ శర్మ తర్వాత భారత టెస్ట్ జట్టును ముందుకు తీసుకువెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు.ఈ మెగా సిరీస్ గిల్ కు అగ్ని పరీక్షగా మారింది. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ లోనూ గిల్ రాణించాల్సి ఉంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ పిచ్ లపై గిల్ విఫలమవుతాడనే తీవ్ర విమర్శలు ఉన్నాయి. భారత టెస్ట్ కెప్టెన్సీ దక్కడం అత్యున్నత గౌరవం. 25 ఏళ్లకే కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న గిల్ భారత టెస్ట్ జట్టుకు ఓవరాల్ గా 37 వ కెప్టెన్. 

ఒక ఆటగాడిగా ఇంకా ఎదుగుతున్న దశలోనే ఇంగ్లండ్‌‌లో ఇండియా టెస్ట్ జట్టుకు కెప్టెన్సీ చేపట్టడం అనే కఠినమైన బాధ్యతను శుభ్‌‌మన్ గిల్ స్వీకరించాడు. ఇది తనపై మామూలు భారం కాదు.  స్వదేశంలో అతని టెస్టు సగటు 42.03 బాగానే ఉంది. కానీ,  విదేశాల్లో (29.50) మాత్రం తేలిపోతున్నాడు. పైగా, ఇంగ్లండ్‌‌లో ఆడిన 3 టెస్టుల్లో కేవలం 14.66 సగటుతో 88 రన్స్‌‌ మాత్రమే చేశాడు. దాంతో ఈ సిరీస్‌‌ అతని బ్యాటింగ్ టెక్నిక్‌‌కే కాకుండా మానసిక స్థైర్యానికి పెద్ద పరీక్ష అవుతుంది. తను క్రీజులో ఎంతసేపు నిలబడతాడన్న దానికంటే ఒత్తిడిలో జట్టును ఎలా నడిపిస్తాడన్న దానిపైనే అందరి దృష్టి ఉంటుంది. 

కెప్టెన్సీ భారం అతని బ్యాటింగ్‌‌పై ప్రభావం చూపుతుందా లేక అదనపు బాధ్యతతో మరింత రాటుదేలుతాడా అనేది ఈ సిరీస్‌‌లో తేలిపోనుంది. ఏదేమైనా  మోడ్రన్ గ్రేట్స్ కోహ్లీ, రోహిత్ ఇద్దరూ లేకుండా 2011 తర్వాత ఇండియా ఆడుతున్న తొలి పూర్తి స్థాయి టెస్ట్ సిరీస్ ఇది. గిల్ కు మాజీ దిగ్గజాలు ధైర్యం చెబుతూ కీలకమైన సలహాలు ఇచ్చాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, రాహుల్ ద్రవిడ్, యువరాజ్ సింగ్ తమ విలువైన సలహాలను గిల్ కు చెప్పారు. ఎవరెవరు ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం.        

విరాట్ కోహ్లీ:

నీ సహజమైన ఆట ఆడు. దేనికీ భయం లేని ఆట ఆడు. నిన్ను నువ్వు నమ్ము 

మహేంద్ర సింగ్ ధోనీ:

టెస్ట్ క్రికెట్ రోలర్ కోస్టర్ లాంటిది. వీటిలో ఎత్తు పల్లాలు ఉంటాయి. ఒత్తిడిని ధరి చేరనివ్వకు. నీ నిర్ణయాలు ధైర్యంగా అమలుపరుచు

రోహిత్ శర్మ:

టీమిండియాను గెలిపించే సత్తా సామర్ధ్యం నీలో ఉంది. ప్రశాంతంగా ఉంటూ నిన్ను నువ్వు నిరూపించుకో. 

రాహుల్ ద్రవిడ్:

నీ సహచరులతో మాట్లాడి వారి అవసరాలు తెలుసుకో. సహచరులతో మాట్లాడడం నీకు చాలా హెల్ప్ అవుతుంది. 

యువరాజ్ సింగ్:

ఈ అవకాశం నువ్వు ఎంతగానో హార్డ్ వర్క్ చేశావు. నువ్వు నీ 100 శాతం ఎఫర్ట్స్ ఇస్తావని నమ్ముతున్నాను.