పేపర్ లీక్ వాస్తవం..సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు ఇవే

పేపర్ లీక్ వాస్తవం..సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు ఇవే

నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పేపర్ లీక్ అనేది వాస్తవం.. ఎంతమందికి చేరిందనేది తేలాల్సి ఉంది. ఇది 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు  సంబంధించిన విషయం.. నీట్ , జేఈఈ సీటు ప్రతి ఒక్క విద్యార్థి కల.. పరీక్ష రద్దు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.. మళ్లీ పరీక్ష నిర్వహించడం అనేది చివరి ఆప్షన్ అని  సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. నీట్ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

నీట్ యూసీ పరీక్షను రద్దు చేసి.. మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోరుతూ వేసిన పిటిషన్లను  సోమవారం (జూలై 8) సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. నీట్ రద్దు కోరుతూ దాఖలైన 25 పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్లు వేసిన వారందరూ నోడ్ న్యాయవాదిని నియమించుకోవాలని సీజేఐ సూచించింది.