1000 పాయింట్ల లాభంలో సెన్సెక్స్ క్లోజ్.. మార్కెట్ల మెగా ర్యాలీకి కారణాలివే..

1000 పాయింట్ల లాభంలో సెన్సెక్స్ క్లోజ్.. మార్కెట్ల మెగా ర్యాలీకి కారణాలివే..

నేడు భారత స్టాక్ మార్కెట్లు భారీ ర్యాలీని నమోదు చేశాయి. మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1,020 పాయింట్లకు పైగా లాభపడగా.. మరో సూచీ నిఫ్టీ కూడా 26,200 పాయింట్ల పైనే స్థిరపడింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ సూచీ 708 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 764 పాయింట్లు పెరిగాయి. అయితే నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడటానికి కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మొదటిగా అమెరికా నుంచి వచ్చిన సానుకూల ఆర్థిక డేటా కారణంగా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందనే అంచనాలు ఇన్వెస్టర్లలో పెరిగాయి. ఇది గ్లోబల్ గా పెట్టుబడిదారులకు ఆశాజనకంగా మారింది. అంతే కాకుండా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(FIIs) భారత మార్కెట్లో భారీగా కొనుగోళ్లు చేపట్టడం కూడా బుధవారం మార్కెట్ల ర్యాలీకి కీలక కారణంగా మారింది. ఈ విదేశీ పెట్టుబడులు మార్కెట్ పై సానుకూల ప్రభావం చూపాయి.

ఇక మార్కెట్లను ముందుకు నడిపించిన మరిన్న కారణాలను గమనిస్తే.. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారం, చమురు ధరల్లో తగ్గుదల, భారత్-అమెరికా మధ్య వ్యాపార ఒప్పందం జరిగే అవకాశాలు కూడా మార్కెట్లో ఆకర్షణ కలిగించాయి. దీనికి తోడు ప్రధాన హెవీ వెయిట్ స్టాక్స్ లో పెరుగుదల కూడా సూచీలను ఊహించని ర్యాలీకి గురిచేశాయని తెలుస్తోంది. ఇవాళ ఇంట్రాడేలో మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్ మంచి ర్యాలీని చూశాయి. ఆటో రంగ కంపెనీలు పాజిటివ్ లాభాలను నమోదు చేశాయి. 

ALSO READ : మాదాపూర్లో 400 మందిని.. నిండా ముంచేసిన ఐటీ కంపెనీ..

ఈ అంశాలు కలిసి బాధ్యతాయుతంగా సూచీలు బలపడటానికీ, మార్కెట్ కు ఉత్సాహం ఇవ్వడానికీ కారణమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 1,022 పాయింట్లు పెరిగి 85,605కి చేరింది, నిఫ్టీ కూడా 320 పాయింట్లు పెరిగి 26,205 వద్ద క్లోజ్ అయ్యింది. ఈ కారణాలతో నేడు భారత పెట్టుబడిదారులకు ఈరోజు స్టాక్ మార్కెట్ ఒక మంచి ర్యాలీని ఇచ్చింది. ఇది ఆర్థిక వృద్ధికి, వ్యాపార వాతావరణానికి సానుకూల సంకేతంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.