నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఆసియా మార్కెట్లు, యూఎస్ ఫ్యూచర్స్ నష్టాల్లో ఉండటం మదుపర్లపై ప్రభావం చూపింది. అమెరికా వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు, క్రూడాయిల్ ధరలు పెరగడం సూచీల నష్టాలకు కారణమయ్యాయి. ఈ నెల 10న ఆర్బీఐ పరపతి విధాన కమిటీ నిర్ణయాలు వెలువడనుండటం కూడా మార్కెట్ పై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 263కుపైగా పాయింట్ల నష్టంతో 58,380.83 వద్ద ట్రేడవుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 44పాయింట్ల లాస్ తో 17,516.30 వద్ద కొనసాగుతోంది. 

మరిన్ని వార్తల కోసం..

యూపీలో పవర్​లోకి వస్తే.. సీఎంగా మళ్లీ యోగి

ఇయ్యాల్టి నుంచి ఆఫీసులకు అందరూ రావాలె