
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మళ్లీ ఎన్‌డీఏ ప్రభుత్వమే రానుందనే సంకేతాలివ్వడంతో సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం దూసుకుపోయాయి. పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులోనే సెన్సెక్స్ 1,421 పాయింట్లు పెరిగి 39,352 పాయింట్లకు చేరింది. ఇక నిఫ్టీ కూడా 3.7 శాతం (421 పాయింట్లు) పెరిగి 11,828 పాయింట్ల వద్ద ముగిసింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో షేర్లు ర్యాలీకి నాయకత్వం వహించాయి. డాలర్‌తో రూపాయి మారకపు విలువ కూడా బలపడింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి.బ్యాంకింగ్, ఆటో షేర్లు ర్యాలీలో ముఖ్యపాత్ర పోషించాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 4 శాతం, ఆటో ఇండెక్స్ 4 శాతం పెరిగాయి.సెన్సెక్స్ షేర్లలో ఎస్‌బీఐ 8 శాతం, యెస్ బ్యాంక్ 6 శాతం, ఎల్ అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, మారుతి, టాటా స్టీల్ ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్‌లు 4 నుంచి 5 శాతం చొప్పున పెరిగాయి. డాలర్‌తో రూపాయి మారకపు విలువ రెండు వారాల గరిష్టస్థాయికి చేరింది. శుక్రవారం ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకపు విలువ రూ. 70.23 వద్ద ముగియగా, సోమవారం అది రూ. 69.36 కి బలపడింది. బాండ్స్‌లో కూడా ర్యాలీ వచ్చింది. పదేళ్ల బాండ్ యీల్డ్ (ప్రతిఫలం) బెంచ్ మార్క్ అంతకు ముందు ముగింపుతో పోలిస్తే ఆరు పాయింట్లు తగ్గి 7.30 శాతం వద్ద ట్రేడవుతోంది.
బీజేపీ సర్కారు వస్తే మరింత పెరుగుదల…..
ఎన్‌డీఏ సీట్లు 300 కి మించితే, ఈ ర్యాలీ మే 23 తర్వాత కూడా కొనసాగుతుందని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
సూచీల విజృంభన...
..బ్యాంకింగ్, ఆటో షేర్లు ర్యాలీలో ముఖ్యపాత్ర పోషించాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 4 శాతం, ఆటో ఇండెక్స్ 4 శాతం పెరిగాయి.
..సెన్సెక్స్ షేర్లలో ఎస్‌బీఐ 8 శాతం, యెస్ బ్యాంక్ 6 శాతం, ఎల్ అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, మారుతి, టాటా స్టీల్ ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్‌లు 4 నుంచి 5 శాతం చొప్పున పెరిగాయి.
డాలర్‌తో రూపాయి రెండు వారాల గరిష్టస్థాయికి చేరింది. శుక్రవారం ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి విలువ రూ. 70.23 వద్ద ముగియగా, సోమవారం రూ. 69.36 కి బలపడింది. బాండ్స్‌లో కూడా ర్యాలీ వచ్చింది. పదేళ్ల బాండ్ యీల్డ్ (ప్రతిఫలం) బెంచ్ మార్క్ అంతకు ముందు ముగింపుతో పోలిస్తే ఆరు పాయింట్లు తగ్గి 7.30 శాతం వద్ద ట్రేడవుతోంది.
… ఒకవేళ ఎన్‌డీఏ సీట్లు 300 కి మించితే, ఈ ర్యాలీ మే 23 తర్వాత కూడా కొనసాగుతుందని ఏంజిల్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మయూరేష్ జోషి తెలిపారు. లిక్విడిటీ పరిస్థితి, కార్పొరేట్ ఫలితాలు, గ్లోబల్ ఆందోళనల ఆధారంగా మార్కెట్ మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు.
… ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇండియా మార్కెట్‌ను గ్లోబల్ మార్కెట్ల నుంచి స్వల్పకాలానికి వేరుపడేలా చేస్తున్నాయని ఎనలిస్టు సందీప్ సబర్‌వాల్ వెల్లడించారు. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైతే, ఆటో, ఇన్‌ఫ్రా, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ రంగాల షేర్లు ఆసక్తికరంగా ఉంటాయని చెప్పారు.
.. మే 23 లోపే నిఫ్టీ–50 తన రికార్డు గరిష్ఠస్థాయి 11,850ని మళ్లీ అందుకుంటుందని భావిస్తున్నట్లు కోటక్ సెక్యూరిటీస్ రిసెర్చ్ హెడ్ రుస్మిక్ ఓజా తెలిపారు. తనంతట తానుగానే సగం కంటే ఎక్కువ సీట్లను బీజేపీ పొందగలదా, లేదా అనే దానిమీద ఆధారపడి మార్కెట్ మరింత పెరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
…వాస్తవ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత మార్కెట్ మళ్లీ ఆర్థిక వ్యవస్థ, కార్పొరేట్ ఫలితాలు వంటి వాటివైపు మళ్లుతుందని సెంట్రమ్ బ్రోకింగ్ రిసెర్చ్ హెడ్ జగన్నాధం తూనుగుంట్ల చెప్పారు.
… గత ఏడాదిలో మెరవని స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు ఈ సారి భారీగా పెరగొచ్చని ఐఐఎఫ్‌ఎల్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ భాసిన్ అన్నారు. పీఎస్‌యూ షేర్లు కూడా బాగుంటాయనే ఆశాభావం ప్రకటించారు.
… సోమవారం ర్యాలీ మార్కెట్ అంతటికీ విస్తరించింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా 3 శాతం ఎగిశాయి.