ఆత్మహత్యకు పాల్పడ్డ సియోల్‌ మేయర్‌‌

ఆత్మహత్యకు పాల్పడ్డ సియోల్‌ మేయర్‌‌
  • సూసైడ్‌నోట్‌రిలీజ్‌ చేసిన పోలీసులు

సియోల్‌: కనిపించకుండా పోయిన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ నగర మేయర్‌‌ పార్క్‌ వున్‌సూన్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన గురువారం ఉదయం నుంచి కనిపించలేదు. కాగా.. శుక్రవారం నగరానికి దగ్గరలోని కొండలపై శవమై కనిపించారు. ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా పోలీసులు మేయర్‌ మృతదేహాన్ని గుర్తించారు. ఈ మేరకు ఆత్మహత్య కింద కేసు నమోదు చేశారు. కాగా.. ఆయన ఆఫీస్‌ నుంచి సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. “ ప్రతి ఒక్కరికి సారీ. జీవితంలో నాతో తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్‌. మా పేరెంట్స్‌ గ్రేవ్‌ దగ్గర అంత్యక్రియలు జరిపించండి. బాధ కలిగిస్తున్న నా ఫ్యామిలీకి సారీ. ప్రతిఒక్కరికి బై” అని పార్క్‌ లెటర్‌‌లో సంతకం చేశారు. ఆయన కనిపించకుండా పోయిన ముందు రోజే ఓ మహిళా ఉద్యోగి మేయర్‌‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టంది. సివిల్‌ యాక్టివిస్ట్‌గా హ్యూమన్‌ రైట్స్‌ లాయర్‌‌గా పనిచేసే పార్క్‌ 2011లో సియోల్‌ మేయర్‌‌గా ఎన్నికయ్యారు. వరుసగా మూడుసార్లు మేయర్‌‌గా ఎన్నికై రికార్డు సృష్టించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీకి 2022లో అధ్యక్షుడి పోటీ రేసులోనూ ఉన్నారు. కాగా.. ఆయన దగ్గర పనిచేసిన మాజీ సెక్రటరీ పార్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.