నొవాక్‌‌‌‌కు లారస్ అవార్డు

నొవాక్‌‌‌‌కు లారస్ అవార్డు

మాడ్రిడ్ : సెర్బియా టెన్నిస్ లెజెండ్ నొవాక్ జొకోవిచ్ ప్రతిష్టాత్మక లారస్ వరల్డ్ స్పోర్ట్స్‌‌‌‌మన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద ఇయర్‌‌‌‌‌‌‌‌ అవార్డు కైవసం చేసుకున్నాడు. ఈ అవార్డును అత్యధికంగా ఐదుసార్లు నెగ్గిన ఆటగాడిగా మరో లెజెండరీ ప్లేయర్ రోజర్ ఫెడరర్‌‌‌‌‌‌‌‌ రికార్డును సమం చేశాడు. గతేడాది ఆస్ట్రేలియన్‌‌‌‌ ఓపెన్, ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌

యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ టైటిళ్లతో నొవాక్ అత్యధికంగా 24 గ్రాండ్‌‌‌‌ స్లామ్స్‌‌‌‌ సొంతం చేసుకోవడంతో అతనికి ఈ అవార్డు లభించింది. కాగా, ఫిఫా విమెన్స్‌‌‌‌ ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ వరల్డ్ కప్‌‌‌‌ నెగ్గిన స్పెయిన్‌‌‌‌ 2023కి గాను వరల్డ్ టీమ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద ఇయర్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. ఆ టీమ్‌‌‌‌కు చెందిన మిడ్‌‌‌‌ ఫీల్డర్‌‌‌‌‌‌‌‌ ఐటనా బొన్మాటి  బెస్ట్ స్పోర్ట్స్‌‌‌‌విమెన్‌‌‌‌ అవార్డు గెలిచింది.