కెనడియన్‌‌ ఓపెన్‌‌లో సెరీనా ఓటమి

 కెనడియన్‌‌ ఓపెన్‌‌లో సెరీనా ఓటమి

టొరంటో: రిటైర్మెంట్​ గురించి ప్రకటించిన తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌‌లోనే  అమెరికా టెన్నిస్‌‌ లెజెండ్‌‌ సెరెనా విలియమ్స్​కు చుక్కెదురైంది. కెనడియన్‌‌ ఓపెన్‌‌ విమెన్స్‌‌ సింగిల్స్‌‌ రెండో రౌండ్‌‌లోనే ఆమె ఇంటిదారి పట్టింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్​లో సెరెనా విలియమ్స్​​ 2–6, 4–6తో వరుస సెట్లలో బెలిందా బెన్సిచ్‌‌ (స్విట్జర్లాండ్‌‌) చేతిలో పరాజయం పాలైంది.