టెన్నిస్కు స్టార్ ప్లేయర్ గుడ్ బై

టెన్నిస్కు స్టార్ ప్లేయర్ గుడ్ బై

టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ ఆటకు వీడ్కోలు పలికింది. యూఎస్ ఓపెన్ మూడవ రౌండ్ లో తన చివరి మ్యాచ్ ఆడిన సెరీనా 7-5, 5-6, 6-1 స్కోర్ తేడాతో అజ్లా టామ్ జానోవిక్ చేతిలో ఓడిపోయింది.ఈ మ్యాచ్ తర్వాత ఆమె తన సుధీర్ఘ టెన్నిస్ కేరీర్ కు ఫుల్స్టాప్ పెట్టింది. యూఎస్ ఓపెన్ కు ముందే ఇది తన చివరి టోర్ని అని సెరీనా ప్రకటించింది. 

తన 14 ఏళ్ల వయస్సులో 1995లో సెరీనా తొలిసారి ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడింది. 17 ఏళ్లకే  తొలి గ్రాండ్ స్లామ్ గెలుచుకుంది. 27 ఏళ్ల తన కెరీర్ లో సెరీనా మొత్తం 23 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిళ్లు గెలిచింది. అంతేకాకుండా 14 డబుల్స్, రెండు మిక్స్ డ్ డబుల్స్ టైటిళ్లతోపాటు నాలుగు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ కూడా ఉన్నాయి.  క్రీడాలోకంలో స్టార్ స్టేటస్ ను అందుకున్న సెరీనా 319 వారాల పాటు నెంబర్ వన్ ప్లేయర్ గా కొనసాగింది.

చివరి మ్యాచ్ ముగిసిన తర్వాత సెరీనా భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ దశాబ్దాలుగా మీరంతా నా వెన్నంటే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం నా తల్లిదండ్రలే.. మొదట్నుంచీ వాళ్లు నాకు అన్నింట్లో అండగా నిలిచారు. నా సోదరి వీనస్ లేకపోతే నేను ఇక్కడిదాక వచ్చేదాన్ని కాదు. ఇది నా జీవితంలో చేసి అత్యంత అద్భుతమైన రైడ్’’ అని చెప్పింది.