13 మర్డర్లు ..13 రేప్‌‌లు 40ఏండ్ల తర్వాత శిక్ష

13 మర్డర్లు ..13 రేప్‌‌లు 40ఏండ్ల తర్వాత శిక్ష

కాలిఫోర్నియా: గోల్డెన్ స్టేట్ కిల్లర్, కాలిఫోర్నియా మాజీ పోలీస్ ఆఫీసర్ కు జీవితఖైదు పడింది. 1975 నుంచి 1986 వరకు 13 మర్డర్స్ , 13 రేప్ ల కేసుల్లో దోషిగా నిర్ధారించిన కోర్టు ఈ శిక్ష విధించింది. నేరా లు ఒప్పుకోవడంతో మరణశిక్షకు బదులుగా జీవిత ఖైదు పడింది. పెరోల్ కు  వీల్లేకుండా 74 ఏళ్ల జోసెఫ్ జేమ్స్ డీయాంజిలియోకు జీవిత ఖైదు విధించాలని ప్రాసిక్యూటర్స్  విజ్ఞప్తి చేయడంతో సాక్రామెంటో కౌంటీ జడ్జి ఈ తీర్పు ఇచ్చారు. తీర్పు చెప్పడానికి ముందు వీల్ చైర్లో ఉన్న దోషి డియాంజిలియోకు కోర్టు మాట్లాడే అవకాశం ఇచ్చింది. తన వల్ల బాధకు గురైన ప్రతి ఒక్కరికీ డియాంజిలియో సారీ చెప్పారు. అయితే అతని సారీలో నిజాయితీ లేదని ప్రాసిక్యూటర్స్ వాదించారు. సాక్రామెంటో కౌంటీలో వరుస రేప్ లు, హత్యలకు పాల్పడ్డాడని, 11 కౌంటీల్లోని 120 ఇళ్లలో దారుణాలకు ఒడిగినట్లినట్లు ప్రాసిక్యూటర్లు చెప్పారు. దశాబ్దాలుగా గోల్డెన్ స్టేట్ కిల్లర్ ఎవరన్నది మిస్టరీగా మారిందని, 2018 ఏప్రిల్ 24న నిందితుడిని గుర్తించినట్లు తెలిపారు. దోషిపై ఎలాంటి దయ చూపక్కర్లేదని, బాధితులు న్యాయం కోసం 40 ఏళ్లకు పైగా ఎదురు చూశారని కోర్టుకు చెప్పారు.