భార‌త్‌లో స్పుత్నిక్-వీ టీకా ఉత్ప‌త్తికి సీరం ద‌ర‌ఖాస్తు

భార‌త్‌లో స్పుత్నిక్-వీ టీకా ఉత్ప‌త్తికి సీరం ద‌ర‌ఖాస్తు

ఇప్ప‌టికే భార‌త్‌లో సీరం ఆక్స్‌ఫ‌ర్డ్ టీకా కొవిషీల్డ్‌ను ఉత్ప‌త్తి చేస్తోంది.లేటెస్టుగా ర‌ష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ను భార‌త్‌లో ఉత్ప‌త్తి చేయ‌డానికి డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (DCGI) కు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్ పనితీరు  గురించి విశ్లేష‌ణ, ప‌రీక్ష‌లు చేయ‌డానికి కూడా ఫర్మిషన్ ఇవ్వాలని సీరం సంస్థ ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు స‌మాచారం.

భార‌త్‌లో స్పుత్నిక్-వీ వినియోగానికి ఇప్ప‌టికే DCGI అనుమ‌తులు ఇచ్చింది. ర‌ష్యా నుంచి ఇప్ప‌టికే దాదాపు 30 ల‌క్ష‌ల డోసులు భార‌త్‌కు చేరుకున్నాయి. వీటిని హైద‌రాబాద్‌లోని రెడ్డీస్ ల్యాబ్స్ ఆధ్వ‌ర్యంలో పంపిణీ చేస్తున్నారు. అలాగే, దేశంలో స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ను రెడ్డీస్ ల్యాబ్ కూడా ఉత్ప‌త్తి చేయ‌నుంది.

మరోవైపు ..అమెరికా కంపెనీ నోవావ్యాక్స్ అభివృద్ధి చేసిన క‌రోనా వ్యాక్సిన్ ఉత్ప‌త్తిని కూడా ప్రారంభించింది. దీనికి అమెరికా నుంచి మ‌రికొన్ని అనుమ‌తులు రావాల్సి ఉంది.