ముంబై: నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఎన్‌ఎంఐఏ) డిసెంబర్ 25 నుంచి కమర్షియల్ విమాన సర్వీసులను ప్రారంభించనుంది. 1,160 హెక్టార్లలో ఈ ఎయిర్‌పోర్ట్‌ను కట్టగా, రెండు రన్‌వేలు ఏర్పాటు చేశారు. లాంగ్‌టెర్మ్‌లో 9 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించే స్థాయిలో నిర్మించారు. నవీ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మొదటగా ఆకాశ ఎయిర్ విమాన సర్వీస్‌లను ప్రారంభించనుంది.
డిసెంబర్ 25న ఢిల్లీ నుంచి నవీ ముంబై ఎయిర్‌పోర్ట్‌కి ఈ కంపెనీ విమానాలు చేరతాయి. అక్కడి నుంచి నుంచి ఢిల్లీ, గోవా, కొచ్చి, అహ్మదాబాద్‌కు సర్వీస్‌లు నడపనుంది. ఇండిగో కూడా అదే రోజున 10 దేశీయ గమ్యస్థానాలకు సర్వీసులు ప్రారంభించనుంది. ప్రారంభ దశలో ఎన్‌ఎంఐఏ రోజుకు 12 గంటలపాటు పనిచేస్తుంది. ముంబై విమానాశ్రయంలో రద్దీ తగ్గనుంది.
