తెలంగాణలో సెమీకండక్టర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని పార్లమెంటు సమావేశాల్లో భాగంగా కోరారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. అదే విధంగా పెద్దపల్లి రైల్వే పెండింగ్ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో స్పష్టతనివ్వాలని కోరారు. బుధవారం (డిసెంబర్ 10) పార్లమెంటు సమావేశాల్లో పాల్గొన్న ఎంపీ వంశీ.. కుందన్ పల్లి ROB పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి- రామగుండం- మణుగూరు రైల్వే పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలన్నారు.
పెద్దపల్లి జిల్లాలో ఓదెల దగ్గర 31 వ LC గేట్ దగ్గర, కోలాపూర్ LC గేట్ 32 దగ్గర, అదే విధంగా పెద్దంపేట్ LC గేట్ 52 దగ్గర రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ ప్రతిపాదన ఉంటే.. అప్రూవల్ కు సంబంధించిన డీటెయిల్స్, ప్రాజెక్ట్ వ్యయం, టైమ్ లైన్ ఏంటో ప్రకటించాలని కోరారు.
ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నలకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. అమృత్ భారత్ స్టేషన్స్ యోజన కింద 1300 రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం జరుగుతోందని తెలిపారు. దేశవ్యాప్తంగా పనులు జరుగుతున్నాయని.. అందులో భాగంగా పెద్దపల్లి రైల్వే పనులు కూడా
సెమీకండక్టర్ ప్లాంట్ చివరి నిమిషంలో ఆంధ్రాకు తరలింపు:
తెలంగాణకు రావాల్సిన సెమీకండక్టర్ ప్లాంట్ ను చివరి నిమిషంలో ఆంధ్రాకు తరలించారని సమావేశాల అనంతరం మీడియా పాయింట్ లో అన్నారు ఎంపీ వంశీకృష్ణ. ఈ నిర్ణయాన్ని ఆరోజే ఖండించినట్లు చెప్పారు. పెద్దపల్లికి సెమీకండర్ వస్తే అభివృద్ధికి దోహదపడుతుందని లోక్ సభ వేదికగా చెప్పామని తెలిపారు.
పెద్దపల్లికి ఐటీ, సెమికండక్టర్ ఫెసిటిలీ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. దీనిద్వారా పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని అన్నారు. తమ విజ్ఞప్తిపై డీపీఆర్ ఇవ్వాలని కేంద్ర మంత్రి కోరినట్లు చెప్పారు. సెమీ కండక్టర్, మౌళిక వసతుల సాధనకై పోరాడుతామని ఈ సందర్భంగా ఎంపీ చెప్పారు.
పూర్తవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీని అభినందించారు మంత్రి వైష్ణవ్.

