స్పెషల్​ డ్రైవ్​పై డ్యాష్​ బోర్డు ఏర్పాటు

స్పెషల్​ డ్రైవ్​పై డ్యాష్​ బోర్డు ఏర్పాటు

హైదరాబాద్​సిటీ, వెలుగు: 90 రోజుల స్పెషల్​డ్రైవ్ లో భాగంగా హెడ్డాఫీసులో డ్యాష్​బోర్డు ఏర్పాటు చేసినట్టు వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి తెలిపారు. సీవరేజీ, తాగునీటి సమస్యలు ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా వస్తున్నాయో డ్యాష్​బోర్డు ద్వారా స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఆయా క్యాన్ నంబర్లను జీపీఎస్ ఆధారంగా గూగుల్ మ్యాప్ లో నమోదు చేస్తున్నామన్నారు. ఒక్కో ప్రాంతంలో ఎన్నిసార్లు ఫిర్యాదులు అందినవి, ఎన్నిసార్లు పరిష్కరించిన వివరాలను ఆ మ్యాప్ లో ఒక బబుల్(బుడగ)లా కనిపించేలాగా ఏర్పాటు చేశామన్నారు. ఫిర్యాదుల సంఖ్యను బట్టి.. బబుల్ పరిమాణం మారుతుందని తెలిపారు.