సేవా భారతి ఫ్రీ ఐసోలేషన్ కేంద్రం

సేవా భారతి ఫ్రీ ఐసోలేషన్ కేంద్రం

 తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క..చాలా మంది పేషెంట్ల్ నానా కష్టాలు పడుతున్నారు. అంతే కాదు సకాలంలో ట్రీట్ మెంట్ అందక మరికొందరు చనిపోతున్నారు. అయితే కరోనా సోకిన వారికి ప్రభుత్వం వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నా.. కొన్ని స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నాయి.

వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా బారిన పడిన  పేదవారి కోసం సేవా భారతి,యూత్ ఫర్ సేవా సంయుక్తంగా తమ వంతుగా సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. వర్చుస సేవా సంస్థ  హైదరాబాద్ సహకారంతో వరంగల్ హంటర్ రోడ్ లోని శ్రీ వ్యాస ఆవాసంలో ఇవాళ(శనివారం) 30 బెడ్లతో ఫ్రీ  ఐసోలేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసింది.RSS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాచం రమేష్ ఈ సెంటర్ ను ప్రారంభించారు.

రెండెకరాల స్థలంలో ఈ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. సెంటర్ లో 24 గంటలు పనిచేసే జనరేటర్స్,ఎయిర్ కూలర్లను సమకూర్చారు. ఉచిత వసతి, భోజనంతో పాటు మెడిసిన్లను పేషెంట్లకు అందజేస్తారు. కరోనా బారిన పడిన పేద కుటుంబాల వారు, కరోనా స్వల్ప లక్షణాలు కలిగిన 60 ఏళ్ల లోపు వారు 7207416163  మొబైల్ నెంబర్ కి ఫోన్ చేసి ఈ కేంద్రంలో చేరవచ్చు.

ఇప్పటికే వరంగల్ ఉమ్మడి జిల్లాలో సేవాభారతి కొవిడ్ బారిన పడిన వారికి ఉచిత డాక్టర్ కన్సల్టేషన్ తో పాటు మందులు కూడా అందజేస్తోంది. కొవిడ్ బారిన పడి మరణించిన పేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేస్తోంది.