
కౌడిపల్లి, వెలుగు : మండల కేంద్రమైన కౌడిపల్లిలో బుధవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్లు, సరైన పత్రాలు లేని ఏడు బైకులను సీజ్చేశారు. అనంతరం కౌడిపల్లి ఎస్ఐ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ వాహనదారులు కచ్చితంగా నంబర్ ప్లేట్, వాహనానికి సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.