బర్త్ డే పార్టీలో అశ్లీల నృత్యాలు.. ఏడుగురి అరెస్ట్

బర్త్ డే పార్టీలో అశ్లీల నృత్యాలు.. ఏడుగురి అరెస్ట్

పుట్టిన రోజు వేడుకల్లో సెమీ న్యూడ్ డ్యాన్సులు చేయించాడు ఓ వ్యాపారవేత్త. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. పోడూరు కవిటం గ్రామానికి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు  మందు, విందుతో పాటు అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేశాడు. ఈ పార్టీని పెనుమట్ర మండలం మార్టేరులోని కోనాల మాణిక్యం కల్యాణ మండపంలో నిర్వహించాడు. విందుకు అతని ఫ్రెండ్స్ ను, పలువురు రాజకీయనాయకులను, బంధువులను ఆహ్వానించాడు.

అమ్మాయిలు అశ్లీల నృత్యాలు చేస్తుండగా ముక్క, మందుతో ఎంజాయ్  చేయడం మొదలెట్టారు పార్టీకి వచ్చిన వారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫక్షన్ హాల్ కి చేరుకుని అశ్లీల నృత్యాలు చేస్తున్న ఐదుగురు యువతులతో పాటు ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేశారు.