జీడిమెట్ల, వెలుగు: స్కూల్లో లిఫ్టు తెగిపడడంలో ఏడు మంది టీచర్లు గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. నిజాంపేట కార్పొరేషన్పరిధిలోని గౌతమ్ మోడల్ స్కూల్లో శుక్రవారం లిఫ్టులో ఏడు మంది టీచర్లు ఎక్కారు. ప్రమాదవశాత్తు లిఫ్టు వైరు తెగిపోవడంతో కిందపడింది. దీంతో అందులోని ఏడుగురు టీచర్లకు గాయాలయ్యాయి.
వీరిలో నలుగురికి తీవ్రగాయాలు కాగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని స్థానికంగా ఉన్న ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ప్రమాదానికి సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా స్కూల్ భద్రతా లోపాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
