
ఆర్ఆర్ఆర్, ఆచార్య సెట్స్‌పై ఉండగానే శంకర్ డైరెక్షన్‌లో సినిమాని స్టార్ట్ చేసేశాడు రామ్ చరణ్. సాధారణంగా శంకర్ సినిమా పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందని అంటుంటారు. కానీ ఆ టాక్‌ని బ్రేక్ చేస్తూ శరవేగంగా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసేశారు. సెకెండ్ షెడ్యూల్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్‌లో రామ్ చరణ్, కియారా అద్వానీతో పాటు మిగిలిన టీమ్ అంతా జాయిన్ కానున్నారు. వీలైనంత వరకు గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట శంకర్. తనకున్న లైనప్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ప్యాన్ ఇండియా చిత్రంలో ఏడు నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ కోసం డెబ్భై కోట్లు ఖర్చుపెడు తున్నట్లు తెలిసింది. దాంతో ఎంత ప్రెస్టీజియస్‌గా తీస్తున్నారో అర్థమవుతోంది. ఇప్పటి వరకు కనిపించని కొత్త చరణ్ కనిపిస్తాడని, ఇంతవరకు దిల్‌రాజు సినిమాల్లో లేనంత రిచ్‌నెస్ ఉంటుందని, ఎప్పుడూ లేనంత వేగంగా శంకర్ ఈ సినిమాని తీస్తున్నాడని.. ఏ రకంగా చూసినా వీళ్లందరి గత చిత్రాలనూ మించి ఈ సినిమా ఉండబోతోందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. దాంతో అంచనాలు మరింత పెరుగుతున్నాయి.