రైల్వేట్రాక్ పై బండరాయి .. పట్టాలు తప్పిన సబర్మతి ఎక్సప్రెస్

రైల్వేట్రాక్ పై బండరాయి .. పట్టాలు తప్పిన సబర్మతి ఎక్సప్రెస్

శనివారం ( ఆగస్టు 17, 2024 ) తెల్లవారుజామున ఘోర ప్రమాదం తప్పింది. వారణాసి నుండి అహ్మదాబాదుకు వెళ్లే సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలు తెల్లవారుజామున 3గంటల సమయంలో కాన్పూర్ సమీపంలో పట్టాలు తప్పింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం కాన్పూర్, భీమ్ సేన్ స్టేషన్ మధ్య బ్లాక్ సెక్షన్లో పట్టాలు  తప్పింది. ట్రాక్ మీద బండరాయి ఉండటమే కారణంగా తెలుస్తోంది.

వారణాసి నుంచి అహ్మదాబాదుకు వెళ్తున్న ఈ రైలు కాన్పూర్ సమీపంలోని గోవింద్ పురి ముందున్న హోల్డింగ్ లైన్ లో పట్టాలు తప్పింది.ఈ ఘటన లో అదృష్టవశాత్తూ ఎలాంటి  అవాంఛనీయ సంఘటనలు జరగకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని రైలులోని ప్రయాణికులను బస్సు మార్గంలో కాన్పూర్ కి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.