కాంగోలో ఆత్మహుతి దాడి.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు

కాంగోలో ఆత్మహుతి దాడి.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు

కాంగోలో ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఉత్తర కివు ప్రాంతం, బెనీ సిటీలోని ఓ బార్ లో ప్రజలపై కాల్పులు జరిపి.. ఓ వ్యక్తి ఆత్మాహుతిదాడి చేశాడు. ఘటనాస్థలానికి చేరుకున్న భద్రతాసిబ్బంది.. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిందనేది ఎవరు అనేది స్పష్టత రావాల్సి ఉందన్నారు అక్కడి అధికారులు.  ఈ దుర్ఘటనలో చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. సెక్యూరిటీ గార్డును తప్పించుకొని బార్ లోకి వెళ్లిన బాంబర్.. అక్కడి ఎంట్రన్స్ డోర్ వద్ద నిలబడి బాంబు పేల్చినట్లు చెబుతున్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ దాడిలో బార్ లో కుర్చీలు, బాటిల్స్, ఫర్నీచర్ చెల్లా చెదురుగా పడ్డాయి. పలువురి అవయువాలు కూడా చెల్లా చెదురుగా పడి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంటనే గాయపడ్డ వారిని దగ్గర్లో ఆస్పత్రులకు తరలించారు. క్రిస్మస్ సందర్భంగా పార్టీ జరుగుతుండటంతో బార్ లో దాదాపు 30 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడి వెనుక అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ADF) కారణమని అక్కడి అధికారులు ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

కాశ్మీర్​లో నలుగురు టెర్రరిస్టుల ఎన్​కౌంటర్​

బీహార్ లో రాత్రి పూట కర్ఫ్యూ ఉండదు