బీహార్ లో రాత్రి పూట కర్ఫ్యూ ఉండదు

బీహార్ లో రాత్రి పూట కర్ఫ్యూ  ఉండదు

పాట్నా: ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి భయాందోళనలు సృష్టిస్తుంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం తేలిగ్గా తీసుకున్నారు. అంత ప్రమాదకర పరిస్థితి ప్రస్తుతం లేదు.. అందుకే రాత్రిపూట కర్ఫ్యూ విధించడం లేదని ఆయన తేల్చి చెప్పారు. కరోనా కేసుల పెరుగుదల.. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా రోజు రోజుకూ పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వ సూచనలతో పలు రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తుండగా.. బీహార్ లో మాత్రం అవసరంలేదంటున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్. 

బీహార్ లో రాత్రిపూట కర్ఫ్యూ విధించాల్సినంత పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, అసోం తదితర రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. మరికొన్ని రాష్ట్రాలు కూడా రేపో మాపో రాత్రిపూట కర్ఫ్యూ విధించే యోచన చేస్తున్నాయి. 

 

ఇవి కూడా చదవండి

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు కరోనా పాజిటివ్

జియో ప్రీపెయిడ్ కస్టమర్లకు ఆఫర్

స్మారక కేంద్రాలు వివిధ సంస్థలకు దత్తత ఇస్తున్నాం

జనవరి 2 వరకు ర్యాలీలు, సభలు బంద్