ఆధ్యాత్మికం:  గోవింద అంటే ఏమిటి.. ఎలా ఉద్భవించింది..  ఆ పదం ఆధ్యాత్మిక రహస్యం ఇదే..!

ఆధ్యాత్మికం:  గోవింద అంటే ఏమిటి.. ఎలా ఉద్భవించింది..  ఆ పదం ఆధ్యాత్మిక రహస్యం ఇదే..!


 తెలుగు ప్రజలు గోవిందా.. గోవిందా అంటూ దేవుడిని దర్శించుకుంటారు.  ఇక తిరుమల గిరుల్లో ఈ నామం ఎప్పుడు మారు మోగుతుంటింది.  పురాణాల ప్రకారం గోవింద అనే పదానికి చాలా విశిష్టత ఉందని చెబుతున్నారు.  దీని అర్దం ఏమిటి.. ఎలా ఉద్భవించింది.. గోవింద పదం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి.. వెంకటేశ్వరస్వామి క్షేత్రాలో ఈ నామాన్ని ఎందుకు జపిస్తారు.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

ఏడుకొండలవాడా… వేంకటరమణా… గోవిందా గోవిందా…అని  తిరుమల గిరులతో పాటు వేంకటేశ్వర స్వామి క్షేత్రాలు  మారుమోగుతుంటాయి.  ఏదో అందరు అంటున్నారు కదా.. అని మనం కూడా గోవింద.. గోవింద అంటూ స్వామిని దర్శించుకుంటాం.  కాని ఈ పదం వెనుక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఉందని పండితులు చెబుతున్నారు.  

గోవిందా అనే నామం తెలుగు ప్రజలకు ఎంతో ఆధ్యాత్మిక అనుబంధాన్ని కలగజేస్తుంది. తిరుమల శ్రీవారి ఆలయంటతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణాలు  నిరంతరం భక్తుల గోవింద నామఘోషతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.  ఈ నామస్మరణ వినగానే ప్రతి తెలుగువాడి హృదయం భక్తిరసంతో నిండిపోతుంది. 

గోవింద అనే నామం..గోవర్థనగిరి కథ నుంచి ఉద్భవించినది పండితులు చెబుతున్నారు. ఈ నామం ద్వాపరయుగంలో ఉద్భవించిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. అప్పుడు  గోకులంలో జరిగిన ఒక విశేష సంఘటనతో గోవింద అనే పదం ఉద్భవించిందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. 

 గోకులవాసులు  ఒకరోజు ఇంద్ర దేవుడిని పూజించేందుకు సిద్ధమవుతారు. ఆ సమయంలో  బాలకృష్ణుడు వారికి  ప్రకృతిని పోషించే గోవర్ధనగిరిని, గోవులను.. పూజించాలని..  గౌరవించాలని చెబుతాడు. ఆయన మాట విని.. గోకులవాసులు ఇంద్రపూజను విరమించి గోపూజ చేస్తారు.

దీనితో ఇంద్ర దేవునికి కోపం వస్తుంది.  గోకులంలో ప్రకృతి బీభత్సం సృష్టించేలా చేస్తాడు.  భయంకరమైన వర్షాలు.. ఉరుములు.. వరదలతో గోకులవాసులు చెల్లచెదురయ్యారు.ఆపదలో ప్రజలను, గోవులను రక్షించేందుకు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని తన చిటికెన వేలితో ఎత్తి గొడుగులా పట్టుకుంటాడు. అలా  ఏడు రోజుల పాటు గోకులవాసులందరూ ఆ గిరి క్రింద సురక్షితంగా ఉంటారు. తనను పూజించని ప్రజలను ఎంతగా ఇబ్బంది పెడదామనుకున్నా.. శ్రీకృష్ణుడు వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చేశాడు.  ఈ విషయాన్ని గమనించిన  ఇంద్ర దేవుడి అహంకారం చెరిగిపోతుంది. 

తరువాత ఇంద్రుడు స్వయంగా వచ్చి శ్రీకృష్ణుని క్షమాపణలు చెప్పి... గోకులంలో ఇంతటి విపత్తుకు తానే కారణమని చెబుతాడు. అదే సమయంలో గోమాత అయిన కామధేనువు వచ్చి... తన సంతానమైన గోవులను రక్షించిన కృష్ణునికి పాలాభిషేకం చేస్తుంది.  అప్పుడు ఇంద్ర దేవుడు కూడా  తన వాహనమైన ఐరావతం ద్వారా గంగాజలంతో అభిషేకం చేస్తాడు. అప్పుడు ఇంద్రుడు ఇలా ప్రకటిస్తాడు.. “నేను దేవతలకే ఇంద్రుడిని..కానీ గోవులకు, భూమికి, ప్రజలకు కాదు. వారికి  అధిపతిగా మీరు గోవిందుడిగా పిలువబడతారని చెబుతాడు. అప్పటి నుంచి శ్రీకృష్ణుడిని భక్తులు ...గోవింద... అనే నామంతో  ఆరాధిస్తుంటారు. 

“గోవింద” అనే పదానికి అర్దం ఇదే..!

గో... అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి.   వాటిలో గోవులు, భూమి, ఇంద్రియాలు, వేదాలు...వింద.. అంటే రక్షించేవాడు..  ఆనందింపజేసేవాడు..   తెలిసినవాడు. అందువల్ల గోవింద అంటే.. గోవులను రక్షించినవాడు... భూమిని కాపాడినవాడు.... ఇంద్రియాలను నియంత్రించేవాడు... వేదార్థాన్ని గ్రహించినవాడు.. ఇలా అన్నీ కలిపి సర్వజీవరక్షకుడు అనే విశిష్టమైన అర్థం వస్తుంది.

వెంకటేశ్వర స్వామి క్షేత్రాల్లో గోవింద నామం ఎందుకు..

కలియుగంలో వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుని గోవింద అని సంభోదించడం ఆనవాయితీగా మారింది. ఏడుకొండల వాడైన వేంకటరమణుడు, గోవర్ధనగిరిని ఎత్తిన కృష్ణుడే అన్న భావనతో భక్తులు గోవిందా… గోవిందా…అంటూ ప్రార్థిస్తారు.  అంటే ద్వాపరయుగంలో ఆవులను రక్షించిన విధంగానే మమ్ములను కూడామని ఒక్కమాటలో  విష్ణుమూర్తి రూపంలో.. వేంకటేశ్వరుని అవతారంగా ఉన్న శ్రీకృష్ణుడిని ప్రార్థించడమే గోవింద అనే పదం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం. ..

గోవింద నామస్మరణలో భక్తి ఉంది, భరోసా ఉంది, శరణాగతి ఉంది. కష్టసమయంలో “గోవిందా!” అని పలికితే రక్షణ లభిస్తుందనే విశ్వాసంతో  కోట్లాది హృదయాల్లో  ఈ పదం స్థిరంగా ఉండిపోయింది. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.