ఘట్ కేసర్ బస్టాండ్ లో నీటి సమస్య తీవ్రం..మరుగుదొడ్లకు తాళాలు

ఘట్ కేసర్ బస్టాండ్ లో నీటి సమస్య తీవ్రం..మరుగుదొడ్లకు తాళాలు

ఘట్ కేసర్, వెలుగు : ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఘట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోని పలు ప్రాంతాల్లో నీటి సమస్య తలెత్తుతోంది. ఈ ప్రభావం ఘట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్టీసీ బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనా పడింది. బోర్లలో నీళ్లు లేకపోవడంతో బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మరుగుదొడ్లను మూసివేశారు. 

మరుగుదొడ్ల వద్ద “నీళ్లు లేవు బందు.. రేపు రాగలరు” అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో అత్యవరసం అయి వచ్చిన ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మహిళలు, వృద్ధులు, పిల్లల పరిస్థితి ఏమిటని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.