మెట్రో స్టేషన్ అడ్డాగా విటులకు ఎర

మెట్రో స్టేషన్ అడ్డాగా విటులకు ఎర
  • రాత్రి 10 దాటితే రోడ్లపైకి వస్తున్న సెక్స్ వర్కర్లు
  • కేపీహెచ్ బీ పీఎస్ కు సమీపంలో మకాం

రాత్రి10 దాటితే చాలు సెక్స్​వర్కర్లు రెచ్చిపోతున్నారు. మెట్రో స్టేషన్ వద్ద మకాం వేసి విటులను ఆకర్షిస్తున్నారు. ఇదంతా ఎక్కడో కాదు కేపీహెచ్ బీ  పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే జరుగుతోంది. మహిళలు మద్యం తాగి ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు. కంట్రోల్ చేయాల్సిన పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. రాత్రి 10 నుంచి 12 గంటల మధ్యలో సెక్స్​వర్కర్లు గుంపులు గుంపులుగా కేపీహెచ్ బీ కాలనీ మెయిన్ రోడ్డు ఎక్కుతున్నారు. పీఎస్ కు ఎదురుగా ఉన్న రోడ్డులో నిలబడి విటులను ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా కేపీహెచ్ బీ మెయిన్ రోడ్డులోని పద్మావతి ప్లాజా, కేపీహెచ్ బీ బస్టాప్ , మెట్రో స్టేషన్ రోడ్డు, ఆర్ఎస్ బ్రదర్స్ నుంచి జేఎన్టీయూ చౌరస్తాలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు, అలాగే సర్వీస్ రోడ్డులో ఎక్కువ సంఖ్యలో మహిళలు నిలబడి రోడ్లపైనే బేరాలు చేస్తున్నారు. అటుగా ఫ్యామిలీ, పిల్లలతో వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉంటుందని ప్రజలు చెబుతున్నారు. ముఖ్యం గా మహిళలు,ఉద్యోగాలకు వెళ్లొచ్చే యువతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా పోలీసుఉన్నతాధికారులు స్పందించి ఈ వ్యవహారాన్నికట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

కేపీహెచ్ బీ కాలనీలో సెక్స్​వర్కర్లు పెరిగిపోతున్నారు.పోలీసులు ఉదాసీనత ,ఈజీగా మనీ వస్తుండటంతో ఈ దందాలోకి వస్తున్నారు. కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో నివసించే వారే అధికంగా ఉంటున్నారు. ముఖ్యంగా ఎల్లమ్మ బండ కాలనీ, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అయితే భాగ్యనగర్ కాలనీ, మెట్రో స్టేషన్, పద్మావతి ప్లాజా మా పరిధిలోకి రావంటే మా పరిధిలోకి రావని కేపీహెచ్ బీ పోలీసులు, కూకట్ పల్లి పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ఈ దందా కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు.

పద్మావతి ప్లాజా, మెట్రో స్టేషన్ మా పరిధిలోకిరావు: సీఐ లక్ష్మీనారాయణ, కేపీహెచ్ బీ పీఎస్

భాగ్యనగర్ కాలనీ, మెట్రో స్టేషన్, పద్మావతిప్లాజా మా పీఎస్ పరిధిలోకి రావు. అవి కూకట్ పల్లి పీఎస్ పరిధిలోకి వస్తాయి. మా పరిధిలో పెట్రోలింగ్ వాహనాలతో గస్తీ పెంచాం. ఎక్కడైనా విటులను ఆకర్షిస్తున్న మహిళలు దొరికితే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నాం