హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ ప్రొ తొలి ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోటీలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ ప్రొ తొలి ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోటీలు

అక్టోబర్ 15 నుంచి ప్రారంభం

హైదరాబాద్, వెలుగు:  స్పోర్ట్స్ ఫర్ ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ) 2024-–25 చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  భాగంగా అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అథ్లెట్ల కోసం ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ ప్రొ క్రీడా పోటీలు జరగనున్నాయి. తొలి ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆతిథ్యం ఇవ్వనుంది.  హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 15న మొదలై 30వ తేదీ వరకు జరిగే ఈ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తారు.  జోనల్, స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నేషనల్ లెవెల్లో రాణిస్తున్న అథ్లెట్లు లేదా  గత ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అథ్లెటిక్స్, బాస్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్, ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, చెస్, స్విమ్మింగ్, టెన్నిస్ ఆటల్లో  సత్తా చాటిన వారికి ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ ప్రొ ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు.  ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ ప్రొ పోటీల కోసం www.SFAPLAY.comలో  రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.