స్విమ్మింగ్ విన్నర్స్‌‌ హర్షిత,  తేజ రామ్​

స్విమ్మింగ్ విన్నర్స్‌‌ హర్షిత,  తేజ రామ్​

హైదరాబాద్, వెలుగు: ఎస్‌‌ఎఫ్‌‌ఏ చాంపియన్‌‌షిప్‌‌ 2024 ఎడిషన్ పోటీలు హైదరాబాద్‌‌లో హోరాహోరీగా సాగుతున్నాయి.  గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో  హర్షిత వర్మ భూపతిరాజు, తేజరామ్ సామినేని విజేతలుగా నిలిచారు.  ది క్రీక్ ప్లానెట్ స్కూల్‌‌కు చెందిన  హర్షిత అండర్‌‌‌‌-16 గర్ల్స్‌‌ 100 మీటర్ల బటర్‌‌‌‌ఫ్లై  స్ట్రోక్‌‌లో  గోల్డ్ మెడల్ నెగ్గింది. అదే స్కూల్ స్టూడెంట్‌‌ అయిన తేజరామ్ బాయ్స్‌‌ 100 మీటర్ల బటర్‌‌ఫ్లై  స్ట్రోక్‌‌లో టైటిల్ గెలిచాడు. బాయ్స్‌‌ అండర్‌‌‌‌-10 హ్యాండ్‌‌బాల్ ఫైనల్లో విజ్ఞాన్స్‌‌ బో ట్రీ స్కూల్‌‌ను ఓడించిజనప్రియ హైస్కూల్  ట్రోఫీ కైవసం చేసుకుంది.  బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీమ్ గర్ల్స్‌‌ అండర్‌‌‌‌-14 వాలీబాల్ ఫైనల్లో జ్ఞాన్స్‌‌ బో ట్రీ స్కూల్‌‌ను ఓడించి  విజేతగా నిలిచింది.