
హైదరాబాద్, వెలుగు: స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ఎస్‌ఎఫ్‌ఏ) ఆరో ఎడిషన్ హైదరాబాద్ అంచె పోటీల్లో విజ్ఞాన్స్ బో ట్రీ స్కూల్ (నిజాంపేట) ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. సోమవారం ముగిసిన పోటీల్లో అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, కరాటే, స్కేటింగ్, వాలీబాల్ ఆటల్లో టైటిళ్లు గెలిచి విజేత ట్రోఫీని అందుకుంది. ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ (పుప్పల్ గూడ) మొదటి రన్నరప్ టైటిల్ సొంతం చేసుకుంది. బాస్కెట్‌బాల్‌లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (ఖాజాగూడ), ఫుట్‌బాల్‌లో మేరు ఇంటర్నేషనల్ స్కూల్ బెస్ట్ టీమ్ అవార్డులు అందుకున్నాయి. అథ్లెటిక్స్, స్కేటింగ్‌లో ఒక గోల్డ్, రెండు సిల్వర్ మెడల్స్ గెలిచిన ధ్రువ పుతుంబక (చిరెక్ స్కూల్) గోల్డెన్ బాయ్ టైటిల్ నెగ్గాడు. సంయుక్త (డీపీఎస్ ఖాజాగూడ), జోహన్నా షిజు (ఒయాసిస్ స్కూల్) సంయుక్తంగా గోల్డెన్ గర్ల్ టైటిల్ అందుకున్నారు.