ఛలో అసెంబ్లీకి ఎస్ఎఫ్ఐ పిలుపు.. విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్

ఛలో అసెంబ్లీకి ఎస్ఎఫ్ఐ పిలుపు.. విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్

హైదరాబాద్ :  నూతన విద్యావిధానం 2020 తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ..ఆదివారం (ఆగస్టు 5వ తేదీన) రోజు ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో గత మూడేళ్లుగా పెండింగ్ స్కాలర్ షిప్స్, రీయింబర్స్ మెంట్స్ నిధులు విడుదల చేయలేదని, వాటిని వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి. నాగరాజు డిమాండ్ చేశారు.

గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీలు)‌, మోడల్ స్కూల్స్ లలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు. ఇప్పటి వరకు మెస్ బిల్లులు విడుదల చేయలేదని, యూనివర్శీటీలలో ఫీజులు పెంచి ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో భారీగా పెంచిన ఫీజులను తగ్గించాలని, విద్యారంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఇందుకోసం తగినన్నీ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. గురుకులాలకు సోంత భవనాలు నిర్మించాలని, కోఠి ఉమెన్స్ యూనివర్శీటీకి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము లేవనెత్తిన అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చించి.. పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.