ఓయూ లేడీస్ హాస్టల్ డైరెక్టర్​ను వెంటనే తొలగించండి : ఆంజనేయులు

ఓయూ లేడీస్ హాస్టల్ డైరెక్టర్​ను వెంటనే తొలగించండి :  ఆంజనేయులు

ఓయూ,వెలుగు:  ఓయూ లేడీస్​హాస్టల్​డైరెక్టర్​ను వెంటనే తొలగించాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం ఓయూ రిజిస్ర్టార్​కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఓయూ ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఆంజనేయులు, కార్యదర్శి రవినాయక్ మాట్లాడుతూ.. లేడీస్ హాస్టల్ లో నెల రోజులుగా విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించడంలేదని, తాగునీరు, పరిశుభ్రత వంటివి పట్టించుకోకపోగా.. నలుగురికి ఫుడ్ పాయిజన్ అయి ఆస్పత్రి పాలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. 

సెంటినరీ హాస్టల్లో 700 మంది పైన విద్యార్థినులు ఉంటుండగా.. ఒకటే మెస్ తో ఉదయం పూట టైమ్ కు టిఫిన్ అందడం లేదని, తినకుండానే క్లాసులకు వెళ్తున్నారని వివరించారు.  హాస్టల్ డైరెక్టర్ ను పలుమార్లు సంప్రదించినా స్పందించడం లేదని, అందుబాటులో లేని ఆమెను వెంటనే తొలగించాలని డిమాండ్​ చేశారు. వర్సిటీ  ఉన్నత అధికారులు తక్షణమే సందర్శించి హాస్టల్​లోని సమస్యలను పరిష్కరించాలని కోరారు.